Tripi Dimri: జోయా చేతిలో అన్ని చిత్రాలా

ABN, Publish Date - May 05 , 2025 | 06:38 PM

నేషనల్ క్రష్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. హిట్లు ఫ్లాపులు తేడా లేకుండా తారాజువ్వలా దూసుకుపోతోంది. రెస్ట్ తీసుకోకుండా వరుస సినిమాలు చేస్తోంది. తన గ్లామర్ ట్రీట్ తో బాలీవుడ్ రాజ్యమేలేస్తోంది. అదృష్టం జలగలా పట్టినా ఆ బ్యూటీ క్రేజీ ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

త్రిప్తి డిమ్రి (Tripi Dimri) .. ఏ మాయ చేసిందో.. ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా బ్యూటీ వెంటే పడుతున్నారు. 'యానిమాల్' (Animal) మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక చెప్పాలంటే బ్యూటీ గ్లామర్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. రోజు రోజుకి గ్లామర్ పెరుగుతోందే కానీ.. ఏ మాత్రం తగ్గడం లేదు అనిపిస్తోంది. అందమే తింటోందా అనేలా.. క్యూట్ లుక్‌తో త్రిప్తి కట్టిపడేస్తోంది. అందుకే అందరూ ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటున్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్టులకు కొట్టేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


ప్రెజెంట్ త్రిప్తి కెరీర్ 'యానిమల్‌' కు ముందు 'యానిమల్‌' కు తర్వాత అన్నట్లు గా మారిపోయింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో పాటు బడా స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తుగా మారుతోంది. ''బ్యాడ్ న్యూజ్‌(Bad Newz) , భూల్ భూలయ్యా 3'' (Bhool Bhulaiyaa 3 )' లాంటి యావరేజ్ సినిమాలను ఖాతాలో వేసుకున్నా... ఫ్యూచర్ ప్రాజెక్టులు మాత్రం నెవర్ బిపోర్ అనేలా ఉన్నాయి. షాహిద్ కపూర్ తో 'అర్జున్ ఉస్తారా'( Arjun-Ustara )మూవీలో త్రిప్తి నటిస్తోంది. యాక్షన్ ప్యాక్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని విశాల్ భరద్వాజ్ (Vishal Bhardwaj)తెరకెక్కిస్తున్నాడు. అయితే మొన్నటి వరకు ఈ మూవీ ఆగిపోయినట్టుగా వార్తలు వినిపించాయి. షాహిద్ కపూర్ (Shahid Kapoor) నటించిన 'దేవా' (Deva) సినిమా బాక్సాఫీస్ బరిలో పరాజయం పాలు కావడంతో 'అర్జున్ ఉస్తారా'పై నీలి నీడలు కమ్ముకున్నాయని అంతా అనుకున్నారు. ఆ రూమర్లపై నేషనల్ క్రష్ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో నిజం లేదని చెప్పడంతో పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని చెప్పుకొచ్చింది. అంతేకాక బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించిన వివరాలు ఫ్యాన్స్ తో పంచుకుంది.

యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi )తో 'ధడక్ 2' (Dhadak 2) లో త్రిప్తి నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈమూవీ 2018 లో వచ్చిన 'ధడక్‌' కు సీక్వెల్. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter) ఈ మూవీతో వెండితెరకు పరిచయమ్యారు. షాజియా ఇక్బాల్ (Shazia Iqbal ) దర్శకత్వంలో ఈ సీక్వెల్ ను జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ సంస్థలు నిర్మించబోతున్నాయి. అంతేకాక ఇంతియాజ్ అలీ (Imtiaz Ali) తెరకెక్కించనున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో త్రిప్తినే హీరోయిన్. ఇంకా పేరు పెట్టని ఈ మూవీతో మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. మాధురీ దీక్షిత్‌ నటిస్తోన్న కామెడీ రైడ్... 'మా బెహన్' ( Maa Behen) లో నేషనల్ క్రష్ మెరవనుంది. అంతేకాక రణబీర్ కపూర్ (Ranbir Kapoor) 'యానిమల్ పార్క్ (Animal Park) ', 'కేజీయఫ్' ఫేమ్ యష్ (Yash) తో ఓ మూవీ బ్యూటీ కిట్టిలో ఉన్నాయి. దాదాపు అరడజన్ సినిమాలతో బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఆమె నటిస్తున్న సినిమాల్లో ఏ రెండు సినిమాలు హిట్ టాక్ ను తెచ్చుకున్న టాప్ హీరోయిన్ గా వెలిగిపోవడం ఖాయమనేస్తున్నారు మూవీ విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Updated Date - May 05 , 2025 | 06:38 PM