Kroll Report: బ్రాండ్ వాల్యూతో టాప్ 10 భారతీయ సెలబ్రిటీ లిస్ట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:26 AM
సెలబ్రిటీ హోదా అంటే కేవలం పేరు ప్రతిష్టలు మాత్రమే కాదు. వారు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్‌ను బట్టి కూడా ఉంటుంది.
సెలబ్రిటీ హోదా అంటే కేవలం పేరు ప్రతిష్టలు మాత్రమే కాదు. వారు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్‌ను (Brand value) బట్టి కూడా ఉంటుంది. క్రికెటర్ల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు వారు పొందే ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రభావం, నెట్‌వర్త్ వీటి సెలబ్రిటీ వ్యాల్యూని పరిగణిస్తారు. తాజాగా క్రోల్ సంస్థ 2024 ప్రకారం సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో టాప్ 25 సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ 2 బిలియన్ల డాలర్లకు చేరిందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.6 శాతం వృద్థి చెందిందని తెలిపింది.
క్రోల్ వివరాల ప్రకారం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat kohli) 231.1 మిలియన్ బ్రాండ్ విలువతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer singh) 170.7 మిలియన్‌తో రెండో స్థానంలో నిలిచారు. షారుక్‌ఖాన్ (Shah rukh Khan) 21 శాతం పెరుగుదలతో 145.7 మిలియన్ విలువ సాధించి మూడో స్థానంలో ఉన్నారు. ఇక కథానాయికల విషయానికొస్తే ఆలియా భట్ (aliabhatt) నాలుగో స్థానంలో 116.4 మిలియన్లతో మెరిసింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 112.2 మిలియన్ బ్రాండ్ విలువతో టాప్ 5లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. కొత్త ఎండార్స్‌మెంట్లు దీనికి కారణమయ్యాయి.
2024 బ్రాండ్ విలువతో టాప్ 10 భారతీయ సెలబ్రిటీలు
విరాట్ కోహ్లీ – 231.1 మిలియన్ USD
రణ్‌వీర్ సింగ్ – 170.7 మిలియన్ USD
షారుక్ ఖాన్ – 145.7 మిలియన్ USD
ఆలియా భట్ – 116.4 మిలియన్ USD
సచిన్ టెండూల్కర్ – 112.2 మిలియన్ USD
అక్షయ్ కుమార్ – 108.0 మిలియన్ USD
దీపికా పదుకొనే – 102.9 మిలియన్ USD
ఎం.ఎస్. ధోనీ – 102.9 మిలియన్ USD
హృతిక్ రోషన్ – 92.2 మిలియన్ USD
అమితాబ్ బచ్చన్ – 83.7 మిలియన్ USD