Khans Trayam Kahani : ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు ఖాన్స్
ABN , Publish Date - Jun 07 , 2025 | 06:41 PM
బాలీవుడ్ ఖాన్ త్రయంగా పేరొందిన ఆమిర్, సల్మాన్, షారుఖ్ - ఇంతకు ముందులా మ్యాజిక్ చేయలేక పోతున్నారని టాక్!... ఈ ముగ్గురూ కలసి ఇప్పటి దాకా నటించలేదు... కలసి నటిస్తే ఆ కహానీ వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ అభిలాష... త్వరలోనే ముగ్గురు ఖాన్స్ కలసి నటించనున్నారని బాలీవుడ్ లో విశేషంగా వినిపిస్తోంది.
ఆమిర్ ఖాన్ (Aamir Khan ) , సల్మాన్ ఖాన్ (Salman Khan) , షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ముగ్గురిలో షారుఖ్ ఒక్కడే రెండేళ్ళ క్రితం రెండు భారీ విజయాలను అందుకున్నారు... అంతకు ముందు షారుఖ్ సైతం పలు ఫ్లాపులు చూశారు... 2023 చివరలో వచ్చిన షారుఖ్ 'డంకీ' (Dunki ) ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది... ఇక ఆమిర్, సల్మాన్ ఇద్దరూ గ్రాండ్ సక్సెస్ కోసం చకోర పక్షుల్లా వేచి ఉన్నారు... ఈ నేపథ్యంలో షారుఖ్ 'కింగ్' (king) లో నటిస్తున్నారు - ఆమిర్ 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) తో త్వరలోనే జనం ముందుకు వస్తున్నారు - 'సికందర్' (Sikandar) ఫ్లాప్ దెబ్బతో 'కిక్ 2' (Kick 2) లో నటించడానికి సల్మాన్ సిద్ధమవుతున్నారు.. ఆమిర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము ముగ్గురమూ కలసి ఓ సినిమా చేయడానికి సిద్ధమేనని చెప్పారు... అప్పటి నుంచీ ఆమిర్, సల్మాన్, షారుఖ్ కలసి నటించే సినిమా వస్తే అది విశేషాలకే విశేషం అంటున్నారు బాలీవుడ్ బాబులు... వీరు ముగ్గురూ కలసి నటించడమేమో కానీ, 2017లోనే వీరి పేర్లతో "ఆమిర్ సల్మాన్ షారుఖ్' అనే సినిమా తెరకెక్కింది... అయితే అప్పటి నుంచీ ఈ ముగ్గురు ఖాన్స్ కలసి నటిస్తే చూడాలని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశిస్తూనే ఉన్నారు... ఇప్పుడు ఆమిర్ ఇద్దరు ఖాన్లతో కలసి నటిస్తానని చెప్పడంతో మళ్ళీ ఆ టాపిక్ ఊపందుకుంది.
1993లో వచ్చిన 'పెహ్లా నషా' (Pehla Nasha) సినిమాలో ఆమిర్, షారుఖ్ వారి పాత్రల్లోనే కాసేపు కనిపించారు. అంతే తప్ప వారిద్దరూ కలసి ఏ చిత్రంలోనూ ఇంతవరకూ నటించలేదు... సల్మాన్ ఖాన్ తో ఆమిర్ ఖాన్ 1994లో వచ్చిన 'అందాజ్ అప్నా అప్నా' (Andaz Apna Apna) లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు... ఇక 1995లో రిలీజయిన 'కరణ్- అర్జున్' (Karan Arjun ) లో సల్మాన్, షారుఖ్ ఇద్దరూ హీరోలుగా నటించారు. తరువాత 2002లో 'హమ్ తుమ్హారే హై సనమ్' (Hum Tumhare Hain Sanam)లోనూ కలసి హీరోలుగా కనిపించారు. సల్మాన్ హీరోగా నటించిన 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' (ar Dil Jo Pyar Karega) సినిమాలో షారుఖ్ కేమియో రోల్ లో తళుక్కుమన్నారు... షారుఖ్ హీరోగా రూపొందిన "కుచ్ కుచ్ హోతా హై (Kuch Kuch Hota Hai ) "లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు సల్మాన్. తరువాత షారుఖ్ హీరోగా తెరకెక్కిన "ఓమ్ శాంతి ఓమ్ (Om Shanti Om) , ట్యూబ్ లైట్ (Tubelights), జీరో (ZERo), పఠాన్" (Pathaan) సినిమాల్లో సల్మాన్ గెస్ట్ అప్పియరెన్స్ మరపురానిది... సల్మాన్, షారుఖ్ ఇద్దరూ కలసి 'దుష్మన్ దునియా కా'(Dushman Duniya Ka)లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు... ఇలా ముగ్గురు ఖాన్లలో ఆమిర్, షారుఖ్ ఇద్దరితో కలసి నటించిన క్రెడిట్ సల్మాన్ కే దక్కింది... వీరు ముగ్గురూ కలసి నటిస్తే చూడాలని వారి అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు...
ఆమిర్, సల్మాన్, షారుఖ్ - ముగ్గురు హీరోలుగా నటించే సినిమాకు కథ కావాలి కదా... గతంలో అమితాబ్ (Amitabh Bachchan) మరో ఇద్దరు హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్ అయిన "నసీబ్ (Naseeb) , అమర్ అక్బర్ ఆంటోనీ (Amar Akbar Anthony)" తరహాలో ఈ ముగ్గురు ఖాన్స్ సినిమా కథ ఉండాలనీ కొందరు ఆశిస్తున్నారు... ఈ ముగ్గురికీ ఎంతో సన్నిహితుడైన ఆదిత్య చోప్రా (Aditya Chopra) తమ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తేనే రక్తి కడుతుందనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు... ఎందుకంటే వైఆర్ఎఫ్ సంస్థ మాత్రమే ఈ ముగ్గురు ఖాన్స్ పారితోషికాలు భరించగలదనీ కొందరి మాట!... ఆమిర్ ఖాన్ అలా అన్నాడో లేదో ఇలా ఖాన్ త్రయం సినిమాపై చర్చ సాగుతోంది... ఈ చర్చల వల్లనైనా ఆమిర్, సల్మాన్, షారుఖ్ కలసి నటిస్తారేమో చూడాలి...