Aditya Dhar: దురంధర్ డైరెక్టర్ సక్సెస్ వెనుక ఇంత కష్టం ఉందా ..?

ABN , Publish Date - Dec 16 , 2025 | 10:15 PM

సక్సెస్ అనేది స్విగ్గీలో పెట్టిన ఆర్దరా అరగంటలో రావడానికి అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పాడు. నిజమే. ఎవరికీ సక్సెస్ అంత త్వరగా రాదు.

Aditya Dhar

Aditya Dhar: సక్సెస్ అనేది స్విగ్గీలో పెట్టిన ఆర్దరా అరగంటలో రావడానికి అని ఒక డైరెక్టర్ సినిమాలో చెప్పాడు. నిజమే. ఎవరికీ సక్సెస్ అంత త్వరగా రాదు. ఒకసారి సక్సెస్ అందుకున్నాక వారు పడిన ఇబ్బందులు కూడా మిగతావారికి ఇన్స్పిరేషన్ కింద మారతాయి. ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న దురంధర్ (Dhurandhar) డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar) సక్సెస్ వెనుక కూడా చాలా ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఉన్నాయి.

ఆదిత్య ధర్ ఒక లిరిసిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. పలు సినిమాలకు పాటలు రాస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక లిరిసిస్ట్ గా ఉన్న సమయంలోనే సినిమాలకు డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాడు. అలా గేయరచయిత కాస్తా స్క్రీన్ రైటర్ గా మారాడు. బాండ్ అనే సినిమాకు మొదట ఆదిత్య డైలాగ్స్ అందించాడు. ఆ తరువాత చాలా సినిమాలకు డైలాగ్స్ అందించాడు. అందులో ఆర్టికల్ 370 కూడా ఉంది.

ఇక దర్శకుడిగా ఆదిత్య ధర్ మొదటి సినిమా యురి. ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. రూ.30 కోట్లు పెట్టి యురి సినిమా సినిమా తీస్తే అది ఏకంగా రూ.350 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కన్నా ముందు ఆదిత్య రాకీ బాత్ అనే సినిమాపై పనిచేశాడు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నిజం చెప్పాలంటే ఆదిత్య ఈ సినిమా కోసం ఒక పోరాటమే చేశాడు. పాకిస్తాన్ నటులను తీసుకున్నాడు అని ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేశారు. అందుకు కారణం అప్పుడు జరిగిన యురి స్ట్రైక్ వలన. దీంతో దానిమీదనే ఎందుకు సినిమా చేయకూడదు అన్న అతడి ఆలోచనకు రూపమే యురి. ఈ సినిమా ఆదిత్య ధర్ ని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది.

ఇక హిట్ సినిమా ఇచ్చినా కూడా రెండో సినిమా రావడానికి ఆదిత్యకి చాలా అంటే చాలా సమయం పట్టింది. మధ్యలో తాను ఎంతగానో ప్రేమించిన హీరోయిన్ యామీ గౌతమ్ ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక ఒక పక్క సినిమాలకు స్క్రీన్ రైటర్ గా చేస్తూనే.. నిర్మాతగా కూడా మారాడు. ఆర్టికల్ 370, ధూమ్ ధామ్ లాంటి సినిమాలను నిర్మించాడు. లిరిసిస్ట్ గా ప‌దేళ్ల పాటూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాక మ‌ధ్య‌లో డైరెక్ట‌ర్ గా అశ్వత్థామ అనే కథపై పనిచేశాడు. బడ్జెట్ సమస్య వలన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దురంధర్ కి అలాంటి బడ్జెట్ సమస్యనే ఎదురవుతుందని ముందుగానే ఊహించి రానదగ్గర ఉన్నదంతా పెట్టి దురంధర్ ఒక పార్ట్ కాదు రెండు పార్ట్ లను ఒకేసారి షూట్ చేసి షాక్ ఇచ్చాడు. అలా దురంధర్.. ఆదిత్య కష్టంతో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Dec 16 , 2025 | 10:15 PM