Thalapathy Vijay: బాలీవుడ్‌కు.. 'జన్ నేత'గా విజయ్

ABN , Publish Date - Dec 23 , 2025 | 09:44 PM

విజయ్ దళపతి 'జన నాయగన్' చిత్రం తెలుగులో పాటు హిందీలోనూ విడుదల కాబోతోంది. హిందీలో ఈ సినిమాకు 'జన్ నేత' అనే పేరు ఖరారు చేశారు.

Jan Netha Hindi movie

విజయ్ దళపతి (Thalapathy Vijay) చివరి చిత్రంగా చెబుతున్న 'జన నాయగన్' (Jana Nayagan) తెలుగులో 'జన నాయకుడు'గా విడుదల కాబోతోంది. అలానే హిందీలో ఈ సినిమాకు 'జన్ నేత' (Jan Netha) అనే పేరును ఖరారు చేశారు. తమిళ, తెలుగు భాషలతో పాటే ఈ సినిమా హిందీలో సైతం పొంగల్ కానుకగా జనవరి 9న విడుదల కాబోతోంది. అలానే ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాబీ డియోల్ (Bobby Deol) ఫస్ట్ లుక్ పోస్టర్ నూ విజయ్ తో కలిపి విడుదల చేశారు మేకర్స్.


'జన్ నేత' చిత్రాన్ని ఉత్తరాదిన జీ స్టూడియోస్ (Zee Studios) సంస్థ రిలీజ్ చేయబోతోంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఇందులో పొలిటికల్ ఇష్యూస్ ను కూడా హీరో డీల్ చేలా కథను తయారు చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం బాగా జరిగిందని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde), మమతా బైజు, ప్రకాశ్ రాజ్ (Prakash Raj), గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రలను పోషించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Dec 23 , 2025 | 10:36 PM