Priya Marathe: ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ‌ సీరియ‌ల్ న‌టి క‌న్నుమూత‌

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:11 PM

భారత టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెల‌కొంది. . ప్ర‌ముఖ‌ సీరియ‌ల్ న‌టి క‌న్నుమూశారు.

Priya Marathe

భారత టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెల‌కొంది. దేశ వ్యాప్తంగా విశేష‌మైన పేరున్న‌ ‘పవిత్ర రిష్టా’ (Pavitra Rishta) సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు ఎంతో సుప‌రిచిత‌మైన నటి ప్రియా మరాఠే (Priya Marathe) (38) క‌న్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆమె ఈ రోజు (ఆగస్టు 31) ఉదయం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

priya marathe

మ‌రాఠీ నుంచి..

మరాఠీ సీరియల్స్‌లో తన కెరీర్ ప్రారంభించిన ప్రియా మరాఠే త‌క్కువ కాలంలోనే హిందీ టెలివిజన్ రంగంలోకూ అడుగుపెట్టింది. ఆపై ‘పవిత్ర రిష్టా’లో వర్ష పాత్ర ఆమెకు ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ సీరియ‌ళ్లు చూసే వారిలో విపరీతమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే.. అదే సీరియల్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకితా లోఖండే వంటి నటులతో కలిసి ఆమె నటన మెప్పించింది. అలాగే ‘కసంహ్ సే’, ‘బడే అచ్ఛే లగ్తే హై’, ‘సాత్ నిభానా సాత్హియా’ వంటి పాపులర్ షోలతో పాటు, ‘కామెడీ సర్కస్’ కూడా ప్రియ‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

priya marathe.jfif

ప్రముఖుల సంతాపం

ప్రియా మరాఠే ఆకస్మిక మరణం పట్ల టెలివిజన్, సినీ రంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. విష‌యం తెలుసుకున్న స‌హా న‌టులు, ఫ్యాన్స్, ముఖ్యంగా మ‌హిళ‌లు సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అమె ప‌టించిన క్లిప్పుల‌ను షేర్ చేస్తు గుర్తు చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:53 PM