Tamannaah Bhatia: తమన్నా మరింత బోల్డ్ గా.. చూసి తట్టుకోవడం కష్టమే
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:54 PM
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) మరో బోల్డ్ అటెంప్ట్ కు సిద్ధమైంది. గత కొన్ని ఏళ్లుగా ఐటెంసాంగ్స్ కే పరిమితమయిన ఈ చిన్నది.. ఇప్పుడు మరో బోల్డ్ సినిమాకు సై అంది.
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) మరో బోల్డ్ అటెంప్ట్ కు సిద్ధమైంది. గత కొన్ని ఏళ్లుగా ఐటెంసాంగ్స్ కే పరిమితమయిన ఈ చిన్నది.. ఇప్పుడు మరో బోల్డ్ సినిమాకు సై అంది. బాలీవుడ్ బోల్డ్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్ అంటే రాగిణి MMS (Ragini MMS) అని చెప్పుకొస్తారు. ఈ సినిమా రెండు పార్ట్ లు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో రికార్డులు సృష్టించాయి. మొదటి పార్ట్ కు పవన్ కృపాలాని దర్శకత్వం వహించగా.. కైనాజ్ మోతివాలా, రాజ్ కుమార్ రావు నటించారు.
ఇక రాగిణి MMS 2 లో అందాల శృంగార భామ సన్నీ లియోన్ నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాకు భూషణ్ పటేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో అడల్ట్ సీన్స్ కు లెక్కే లేదు. ఇప్పుడు ఈ సినిమాకు మరో పార్ట్ ను తెరకెక్కించాలని ఏక్తా కపూర్ ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం రాగిణి MMS 3 లో రాగిణిగా తమన్నా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఈసారి ఆ రెండు పార్ట్ లకు మించి అడల్ట్ సీన్స్ ఎక్కువ ఉండబోతున్నాయని వినికిడి.
ఇప్పటికే లస్ట్ స్టోరీస్, జీఖర్దా లాంటి వెబ్ సిరీస్ లలో హద్దుమీరి అందాలా ఆరబోత, అడల్ట్ సీన్స్ చేసిన తమన్నాను తెలుగు ప్రేక్షకులు ట్రోల్ చేశారు. అప్పటి నుంచి తెలుగులో ఈ చిన్నది కనిపించింది కూడా తక్కువే. ఇక ఇప్పుడు ఏకంగా ఇలాంటి సినిమాలో అమ్మడు మరింత బోల్డ్ గా కనిపిస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే ప్రశ్న ఎదురవుతుంది. తమ్ము మాత్రం ఏ ఛాలెంజింగ్ పాత్రకైనా సిద్దమే అనే టైప్. అందులోనూ బ్రేకప్ అయ్యి కెరీర్ పై ఫోకస్ చేస్తున్న ఆమెకు ఇది ఒక మంచి అవకాశం. అందుకే కాదనకుండా ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.