VVan: మైథలాజికల్‌ కథలో తమన్నా..

ABN , Publish Date - May 02 , 2025 | 03:50 PM

"అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. సిద్థార్థ్‌ మల్హోత్రా హీరోగా అరుణభ్‌ కుమార్‌, దీపక్‌ మిశ్రా దర్శకత్వంలో ‘వి వన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ అనే మైథలాజికల్‌ సినిమా తెరకెక్కుతోంది.


"అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia). సిద్థార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) హీరోగా అరుణభ్‌ కుమార్‌, దీపక్‌ మిశ్రా దర్శకత్వంలో ‘వి వన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’ (Vvan) అనే మైథలాజికల్‌ సినిమా తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, ది వైరల్‌ ఫీవర్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడిస్తూ, దానికి సంబంధించిన ప్రీ టీజర్‌ను విడుదల చేశారు.

రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్‌ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్‌’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ సోషల్‌ మీడియిలో పేర్కొన్నారు తమన్నా. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - May 02 , 2025 | 04:16 PM