Meghalaya murder case: కుటుంబ సభ్యుల అంగీకారంతో ‘హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:56 PM

మేఘాలయ ‘హనీమూన్‌ మర్డర్‌’ (Honeymoon murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! త్వరలో ఈ మర్డర్‌ కేసు సినిమాగా రాబోతుంది.

Honeymoon in shillong


మేఘాలయ ‘హనీమూన్‌ మర్డర్‌’ (Honeymoon murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! త్వరలో ఈ మర్డర్‌ కేసు సినిమాగా రాబోతుంది. బాలీవుడ్‌ దర్శకుడు ఎస్‌పీ నింబావత్‌ (SP nimbawath) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీని కోసం మృతుడు రాజా రఘువంశీ కుటుంబసభ్యులను కలిసి దర్శకుడు మాట్లాడారు. వారు కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ‘హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ మేరకు రాజా రఘువంశీ (Raja Raghuvamsi) కుటుంబ సభ్యులు మాట్లాడారు. ‘ఈ హత్య కేసుపై సినిమా తీసేందుకు మేం అంగీకరించాము. మా సోదరుడి మృతిని వెండితెర పైకి తీసుకొస్తేనే  తప్పు ఎటువైపు ఉందనేది తెలుస్తుందనే ప్రజలకు తెలుస్తుంది’ అని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు సచిన్‌ తెలిపారు. దర్శకుడు నింబావత్‌ మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్థమయ్యాం.  స్ర్కిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. 80శాతం చిత్రాన్ని ఇందౌర్‌లో, 20శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తాం’ అన్నారు. ఆర్టిస్ట్‌లు ఎవరనేది త్వరలో చెబుతామన్నారు. (Honeymoon shillong)

అసలు ఈ కేసు ఏంటంటే..  
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. ఈ ఏడాది మే 11న అతడికి  సోనమ్‌తో పెళ్లి జరిగింది. 20న హనీమూన్‌ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కన్పించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్‌ కోసం గాలించగా..ఆమె  జూన్‌ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది.  ప్రియుడితో కలిసి ఆమే భర్తను హత్య చేసినట్లు  విచారణలో తేలింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన ప్రియుడు రాజ్‌ కుశ్వాహా, మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - Aug 07 , 2025 | 02:00 PM