Sai Pallavi: థియేట‌ర్ల‌కు.. సాయి ప‌ల్ల‌వి తొలి హిందీ చిత్రం! ఎప్పుడంటే

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:23 PM

తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో సౌత్ ఇండియాలో ఆగ్ర స్థానంలో కొన‌సాగుతున్న క‌థానాయిక‌ సాయి పల్లవి

sai pallavi

తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో సౌత్ ఇండియాలో ఆగ్ర స్థానంలో కొన‌సాగుతున్న క‌థానాయిక‌ సాయి పల్లవి (Sai Pallavi). చివ‌ర‌గా అమ‌ర‌న్‌, తండేల్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన లేడీ సూప‌ర్ స్టార్ త్వ‌ర‌లో మ‌రో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అరించేందుకు సిద్ధ‌మైంది.

ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు, త‌మిళ సినిమాలు మాత్ర‌మే చేస్తూ వ‌చ్చిన సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఈక్ర‌మంలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (JunaidKhan) హీరోగా వ‌స్తున్న చిత్రంలో న‌టిస్తుండ‌గా, ర‌ణ‌బీర్ క‌పూర్‌తో రామ‌య‌ణ్ మూవీలో న‌టిస్తోంది.

Sai Pallavi

అయితే.. సాయు ప‌ల్ల‌వి రామాయ‌ణ్‌కు ముందే న‌టించిన తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (EkDin) నవంబర్ 7, 2025న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేక‌ర్స్‌ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ (Aamir Khan Productions) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సునీల్ పాండే (Sunil Pandey) దర్శకత్వం వహించగా, రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా జ‌పాన్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కింది. ఇదిలాఉంటే సాయి ప‌ల్ల‌వి న‌టించిన రెండో చిత్రం రామాయ‌ణ్ 2026 దీపావ‌ళికి విడుద‌ల కానుంది.

Sai Pallavi

Updated Date - Jul 08 , 2025 | 04:23 PM