Sonali bendre: క్యాన్సర్‌ని జయించడంలో నా అనుభవాన్ని చెప్పానంతే..
ABN , Publish Date - Nov 25 , 2025 | 05:10 PM
పలు వేదికలపై సెలబ్రిటీలు వ్యాఖ్యలు చిక్కుల్లో పడేస్తుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే సోనాలి బింద్రేకు ఎదురైంది. ఆమె క్యాన్సర్‌ను జయించిన వ్యక్తి. దానిని ఉద్దేశించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పలు వేదికలపై సెలబ్రిటీలు వ్యాఖ్యలు చిక్కుల్లో పడేస్తుంటాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే సోనాలి బింద్రేకు ఎదురైంది. ఆమె క్యాన్సర్‌ను జయించిన వ్యక్తి. దానిని ఉద్దేశించి చెబుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దాంతో కొందరు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఆ కామెంట్స్‌పై స్పష్టతనిస్తూ సోనాలి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
2018లో సోనాలి బింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన సంగతి తెలిసిందే! అయితే ఆమె మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ వ్యాధి నుంచి బయటకు వచ్చి ఎంతోమందిలో ఆత్మవిశ్వాస్వాని నింపుతున్నారు. ఇటీవల ఓ సెషన్‌కు హాజరైన ఆమె క్యాన్సర్‌ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో హెల్ప్ అయిందన్నారు. ఆ వ్యాఖ్యలను కొందరు డాక్టర్లు ఖండించారు. పకృతి వైద్యం క్యాన్సర్‌ను తగిస్తుందని ఎక్కడా ఆధారాలు లేవంటూ విమర్శలు గుప్పించారు. దీంతో సోనాలి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘నేను డాక్టర్‌ని అని ఎప్పుడు నేను చెప్పలేదు. నిజాయితీగా ఆ మహమ్మారి వల్ల నేను పడిన బాధను ఆ రోజు అక్కడున్న జనాలతో షేర్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదు. మోసం చేసే వ్యక్తిని కాదు నేను. కొన్నేళ్లు క్యాన్సర్‌తో నరకం చూశా. దాని వల్ల్ల కలిగే భయం, బాధలు ఎలా ఉంటాయో అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ రోజు వేదికపై నేను మాట్లాడినవన్నీ నా అనుభవాలు, పాఠాలు. అందుకే పదేపదే చెబుతున్నాను. క్యాన్సర్లు అన్నీ ఒకే లక్షణాలు కలిగి ఉండవు. వాటికి ట్రీట్‌మెంట్ కూడా వేర్వేరుగా ఉంటుంది అని నా అనుభవాలు పంచుకుంటూ నేను తీసుకున్న ట్రీట్‌మెంట్ గురించి చెప్పానంతే. దీనిని అందరూ అంగీకరించాలనో, పాటించాలనో నేను చెప్పలేదు. ఆ సమయంలో నా స్థితి ఎలా ఉండేదో నిజాయతీగా మీతో పంచుకున్నారంతే’ అని సోనాలి బింద్రే అన్నారు.