Sonali bindre: రాజ్ ఠాక్రేతో అనుబంధం.. ఫైర్ అయిన సోనాలి
ABN , Publish Date - Jun 07 , 2025 | 07:35 PM
నటి సోనాలి బింద్రే (Sonali bindre) అసహనం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేతో (Raj Thackeray) తనకు అనుబంధం ఉందంటూ జరిగిన ప్రచారం, వైరల్ అయిన వీడియోలపై ఆమె మండిపడ్డారు.
నటి సోనాలి బింద్రే (Sonali bindre) అసహనం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేతో (Raj Thackeray) తనకు అనుబంధం ఉందంటూ జరిగిన ప్రచారం, వైరల్ అయిన వీడియోలపై ఆమె మండిపడ్డారు. ఈ అవాస్తవ కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. 1996లో మైకేల్ జాక్సన్ ఇండియా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయన్ని ఆహ్వానించిన వారిలో రాజ్ ఠాక్రే, సోనాలి బింద్రే ఉన్నారు. సుమారు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఇటీవల ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో సోనాలి, రాజ్ నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కాగా, అది చూసి నెటిజన్లు.. వీరిద్దరి మధ్య అనుబంధం ఉందంటూ ప్రచారం చేశారు. పాత, కొత్త ఫొటోలను కలిపి వైరల్ చేశారు.
దీనిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. ఇలాంటి ప్రచారాలు జరిగినట్లు తనకు తెలియదన్నారు. ‘‘మా ఇద్దరి గురించి ఇలాంటి ప్రచారం జరిగినట్లు నా దృష్టికి రాలేదు. చాలామంది నెటిజన్లు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ సతీమణి షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి ఫ్రెండ్స్. అలా ఇరు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. చిన్నతనం నుంచే మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ ఆ అది కొనసాగుతోంది’’ అని అన్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఆ రంగంలో రాణించాలంటే ప్రశంసలు, విమర్శలు ఏది ఎదురైనా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంత ధైౖర్యం నాకు లేదు. రాజకీయాలపై నాకు పెద్ద అవగాహన లేదు’’ అని ఆమె అన్నారు.