Smriti Mandhana: నా పెళ్లి ఆగిపోయింది.. దయచేసి ఇక వదిలేయండి
ABN , Publish Date - Dec 07 , 2025 | 03:30 PM
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) గురించి అటు క్రీడా అభిమానులకు మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Smriti Mandhana: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) గురించి అటు క్రీడా అభిమానులకు మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కి మించిన అందం స్మృతి సొంతం. అందుకే సినిమా అభిమానులు కూడా ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. ఇక కొన్నిరోజుల క్రితమే స్మృతి పెళ్లి మధ్యలోనే ఆగిపోయిన విషయం తెల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ మచ్చల్ (Palash Muchhal) తో ఆమె వివాహం ఎంతో ఘనంగా జరగాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో వారు ఈ పెళ్లిని రద్దు చేశారు.
స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి వాయిదా పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని, పలాష్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం వలనే ఈ పెళ్లిని స్మృతి రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. వారం రోజులుగా ఈ పెళ్లి గురించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎట్టకేలకు స్మృతి తన పెళ్లి వాయిదా పడలేదు.. ఆగిపోయిందని ప్రకటించింది. పలాష్ కూడా ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చాడు.
'గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి చాలా ఊహాగానాలు చెలరేగాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. నేను చాలా వ్యక్తిగత వ్యక్తిని. దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను. కానీ వివాహం రద్దు చేయబడిందని నేను స్పష్టం చేయాలి. అందుకే చెప్తున్నాను. నా పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్నీ మీరు కూడా అర్ధం చేసుకొని మా రెండు కుటుంబాలకు గోప్యత కలిగించాలని కోరుకుంటున్నాను.
ఎల్లప్పుడూ నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి కష్టపడతాను. వీలైనంత కాలం భారతదేశం తరపున ఆడటం, ట్రోఫీలు గెలవడం కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. దానిపై నా దృష్టి ఎప్పటికీ ఉంటుంది. మీరందరూ నాకు సపోర్ట్ గా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇది ముందుకు సాగాల్సిన సమయం' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.