Siddhi Idnani: అందరూ అన్నం తింటారు.. నేను మాత్రం..
ABN , Publish Date - Dec 18 , 2025 | 08:19 AM
తనకు సినిమా అంటే అమితమైన పిచ్చి అని ఒక విధంగా చెప్పాలంటే తీరని ఆకలి వంటిందని హీరోయిన్ సిద్ధి ఇద్నానీ అన్నారు
తనకు సినిమా అంటే అమితమైన పిచ్చి అని ఒక విధంగా చెప్పాలంటే తీరని ఆకలి వంటిందని హీరోయిన్ సిద్ధి ఇద్నానీ (Siddi Idnani) అన్నారు.ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ‘స్వల్ప విరామం తర్వాత తమిళంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. సినిమా అంటే అమితమైన ఇష్టం. ఈ కారణంగానే అదనపు బాధ్యత ఉందని భావిస్తాను. నా తొలి సినిమా పూర్తికాగానే కొంత విశ్రాంతి అవసరమైంది. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ముఖ్యమైనది ఆకలి. అందరూ అన్నం తింటారు.. నేను మాత్రం.. సినిమాలు ఎక్కువ చేయాలనే ఆకలితో ఉన్నా. ఇంకా బాగా చేయాలన్న తపనతో ఉన్నాను. ఇక్కడ సెటిల్ అయ్యామనే భావన ఏమాత్రం మనసులోకి దరిచేరనీయరాదు. హీరోయిన్ అనే ట్యాగ్ రాగానే డ్యూయట్, లవ్, రొమాన్స్, ముద్దు సన్నివేశాలు ఇలాంటివన్నీ చేయాలి. కానీ, వీటిలో ఏ ఒక్కదానిలో ఇష్టం లేదు. బలమైన కథా పాత్రల్లో చేసి, మంచి గుర్తింపు పొందాలన్నదే నా లక్ష్యం’ అన్నారు.