Shahrukh khan : హాలీవుడ్ స్టార్స్ కంటే ముందు...

ABN, Publish Date - May 02 , 2025 | 01:02 PM

ఇండియాలోనే అత్యంత సంపన్న నటులలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒకరు. బాలీవుడ్ ఇప్పటికి తిరుగులేని హీరోగా రాణిస్తున్నాడు కింగ్ ఖాన్. తాజాగా ఆయన హాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

సినీ ప్రపంచం అంటేనే గ్లామర్ వరల్డ్. ఏ ఇండస్ట్రీ స్టార్లు అయినా తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకు పోతుంటారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూకుడు చూపిస్తుంటారు. సినిమాల విజయాల్లోనే కాదు... సంపాదనలోనూ ఔరా అనిపించుకుంటున్నారు. అయితే అభిమానులు, నెటిజన్లలను ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడుతుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ స్టార్ ఎవరా? అని. తాజాగా ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల లిస్ట్ లో బాలీవుడ్ హీరో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharuk Khan) స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, టాప్ హీరోగా ఎదిగాడు. అందుకే సక్సెస్ రేట్ లోనే కాదు సంపదలో కూడా బెస్ట్ అనిపించుకుంటున్నాడు. పైగా వేల కోట్లకు అధిపతి గా నిలిచాడు. పారితోషికంతో పాటు పలు వ్యాపారాల ద్వారా కోట్లు గడిస్తున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్ట్ లో కింగ్ ఖాన్ (King Khan ) పేరు కూడా నిలిచింది. హాలీవుడ్ హీరోలను సైతం అతను వెనక్కి నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన టాప్ 10 నటుల జాబితాను పోస్ట్ చేసింది. ఈ జాబితాలో హాలీవుడ్ లో సంచనాలకు కేరాఫ్ గా మారిన ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ ( Arnold Schwarzenegger), డ్వేన్ జాన్సన్ (Dwayne Johnson), టామ్ క్రూజ్(Tom Cruise) , జార్జ్ క్లూనీ (George Clooney), బ్రాడ్ ఫిట్ (Brad Fit), జాకీ చాన్ (Jackie Chan) లాంటి హీరోలను వెన‌క్కి నెట్టి... సంపన్నుడిగా రికార్డులకెక్కాడు షారుఖ్ ఖాన్. అమెరికాకు చెందిన నటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆయన సుమారు 8, 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కలిగి ఉన్నాడు. రెండో స్థానంలో టైలర్ పెర్రీ, మూడో స్థానంలో డ్వేన్ జాన్సన్ నిలిచాడు.


ఇక ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. కింగ్ ఖాన్ సంపద రూ. 7,300 కోట్లు. బ్రాడ్ ఫిట్, టామ్ హాంక్స్, జార్జ్ క్లూనీ , ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ లాంటి టాప్ హీరోల్ని సంపాదనలో వెనక్కి నెట్టి టాప్ లో నిలవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాదాపు మూడున్నర ద‌శాబ్దాల చరిత్రలో కింగ్ ఖాన్ షారూఖ్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో పెట్టుబ‌డులు పెట్టడంతో పాటు రెడ్ చిల్లి సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తూ కోట్లు సంపాదించుకున్నాడు. దాంతో సంపన్నుల జాబితాలో కింగ్ ఖాన్ నాలుగవ స్థానంలో నిలవడంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అయితే ఈ లిస్ట్ లో అమెరికన్లు, చైనా వాళ్లు ఎక్కువగా ఉండగా.... ఇండియా నుంచి షారుక్ కి మాత్రమే చోటు దక్కింది.

Updated Date - May 02 , 2025 | 01:03 PM