Shah Rukh Khan: 33 ఏళ్ల కెరీర్‌లో...

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:33 AM

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ఖాన్‌ను తొలిసారిగా జాతీయ ఉత్తమ చలన చిత్ర నటుడు పురస్కారం వరించింది. 2023లో

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ఖాన్‌ను తొలిసారిగా జాతీయ ఉత్తమ చలన చిత్ర నటుడు పురస్కారం వరించింది. 2023లో విడుదలైన ‘జవాన్‌’ చిత్రంలో నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. బాక్సాఫీసును షేక్‌ చేసి ఏకంగా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. షారుక్‌ఖాన్‌ తొలుత తన కెరీర్‌ను బుల్లి తెరతో ప్రారంభించారు. అనంతరం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘దీవానా’. 1992లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షారుక్‌ తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశారు. ‘డర్‌’, ‘బాజీగర్‌’, ‘ దిల్‌సే’, ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘దేవదాస్‌’, ‘వీర్‌-జరా’, ‘కల్‌ హో న హో’, ‘పహేలి’, ‘స్వదేశీ’ , ‘చెక్‌ దే ఇండియా’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’, ‘పఠాన్‌’ వంటి చిత్రాలు షారుక్‌ఖాన్‌ కెరీర్‌లో మైలు రాళ్లుగా నిలిచాయి. కాగా, 2005లో షారుక్‌ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహూకరించింది.

Updated Date - Aug 02 , 2025 | 06:33 AM