Sarzameen: సర్జమీన్ నుంచి.. మేరే ముర్షీద్ మేరే యారా వీడియో సాంగ్
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:44 PM
ఫృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ నటించిన బాలీవుడ్ చిత్రం సర్జమీన్.
మలయాళ సూపర్ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కాజోల్ (Kajol), సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) కాంబినేషన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం సర్జమీన్ (Sarzameen). హిందీ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ సినిమాను నిర్మించగా రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందించాడు.
ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ (Boman Irani) తనయుడు కయోజ్ ఇరానీ (Kayoze Irani) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వచ్చే వారం డైరెక్ట్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో ఓటీటీ లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేరే ముర్షీద్ మేరే యారా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. జానీ ఈ పాటకు సాహిత్యం అందించగా స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా సల్మాన్ అలీతో కలిసి ఆలపించారు.