Blackbuck: బాలీవుడ్‌ను.. వదలని కృష్ణ జింకల కేసు! కోర్టులో ప్ర‌భుత్వం స‌వాల్‌

ABN , Publish Date - May 18 , 2025 | 07:54 AM

ఏ ముహుర్తానా స‌ల్మాన్ ఖాన్ అండ్ టీం జింక‌ల వేట చేశారో కానీ మూడు ద‌శాబ్దాలు కావ‌స్తున్నా.. ఆ కేసు తేల‌డం లేదు. ఓ అడుగు ముందుకు ప‌డితే రెండ‌డుగులు వెన‌క్కి అన్న‌న చందానా ప‌రిస్థితి త‌యారైంది.

salman

ఏ ముహుర్తానా స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) అండ్ టీం జింక‌ల వేట చేశారో కానీ మూడు ద‌శాబ్దాలు కావ‌స్తున్నా.. ఆ కేసు తేల‌డం లేదు. ఓ అడుగు ముందుకు ప‌డితే రెండ‌డుగులు వెన‌క్కి అన్న‌న చందానా ప‌రిస్థితి త‌యారైంది. ఇప్ప‌టికే ఈ కేసు విష‌యంలో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న స‌ల్మాన్ కు.. జింక‌ల వేట జ‌రిగిన‌ప్పుడు చంటి పిల్లాడిగా ఉన్న లారెన్స్ భిష్ణోయ్ వంటి వారు పెద్దై ఇప్పుడు చంపేస్తామంటూ ప‌ర్స‌న‌ల్‌గా కూడా తీవ్ర బెదిరింపులు వ‌స్తుండ‌డంతో స‌ల్మాన్‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. వారినే కాదు ఆ కేసులో ఉన్న ఇత‌ర న‌టులు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), దుశ్యంత్ సింగ్ (Dushyant Singh), సీనియర్ హీరోయిన్లు టబూ (Tabu), నీలం (Neelam), సోనాలీ బింద్రే (Sonali Bendre) లను సైతం వెంటాడుతునే ఉంది.

అయితే.. మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అయింది. రాజస్థాన్ (Rajasthan) బిష్ణోయ్ తెగ వారు దైవంగా భావించే కృష్ణ జింకలను వేటాడిన కేసులో 27ఏళ్ల విచార‌ణ అనంత‌రం బాలీవుడ్ న‌టులను నిర్థోషులుగా పేర్కొంటూ గతంలో జోద్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా.. రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు మ‌రోమారు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. అంతేగాక‌ అటు సల్మాన్ ఖాన్ కూడా తన జైలు శిక్షను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉండ‌డం విశేషం.

అస‌లు క‌థ ఇది..

1998 అక్టోబర్ 1న జోధ్ పూర్ పరిసరాల్లోని కంకణీ గ్రామ సమీపంలో హమ్ సాథ్ సాథ్ హై హై (Hum Saath-Saath Hain) చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఓ రోజు విరామ స‌మ‌యంలో అందులో న‌టిస్తున్న‌ సల్మాన్ ఖాన్ (Salman Khan) , సైఫ్ అలీఖాన్, నీలం, సోనాలీ బింద్రే, టబూలు అంతా క‌లిసి ప‌క్క‌నే ఉన్న‌ ఆడ‌విలోకి వెళ్లి కృష్ణ జింకలను వేటాడినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వివాదంలో సల్మాన్‌పై భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51, సైఫ్, టబూ, సొనాలీ, నీలం, దుశ్యంత్ లపై సెక్షన్ 51 రెడ్ విత్ సెక్షన్ 149ల‌ ప్ర‌కారం కేసులు నమోద‌వ‌గా జోధ్ పూర్ కోర్టులో విచారణ జ‌రిగింది. ఆపై 2018లో సల్మాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మిగతా ఐదుగురు నిర్ధోషులని పేర్కొంది. సల్మాన్ జింకలను స్వ‌యంగా కాల్చినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని పేర్కోంది.


rajasthan.jpg

ఇదిలాఉంటే.. ఈ కేసులో నటులు సైఫ్, టబు, నీలం, సోనాలీ బింద్రే, దుశ్యంత్ సింగ్ లను గతంలో జోద్ పూర్ కోర్టు నిర్దోషులుగా తేల్చుతూ ఇచ్చిన తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా హై కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్.. ఇదే కేసులో పెండింగ్‌లో ఉన్న మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని, సంబంధిత పెండింగ్ కేసులతోపాటు లిస్ట్ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూలై 28 కి వాయిదా వేశారు. అంతేగాక‌.. బదిలీ పిటిషన్ అనుమతులు, సల్మాన్‌కు విధించిన శిక్ష అంశాలను కూడా ఇందులో చేర్చింది.

రీసెంట్‌గా రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పిల్ పిటిషన్‌తో మరోసారి ఈ బాలీవుడ్‌ నటులు మ‌ళ్లీ చిక్కుల్లో పడిన‌ట్లైంది. ఇప్ప‌టికే ఈ కేసు విష‌యంలో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న స‌ల్మాన్ కు.. జింక‌ల వేట జ‌రిగిన‌ప్పుడు చంటి పిల్లాడిగా ఉన్నఇప్ప‌టి గ్యాంగ్ స్టర్ లారెన్స్ భిష్ణోయ్ (Lawrence Bishnoi) వంటి వారు ఇప్పుడు స‌ల్మాన్ (Salman Khan) ను చంపేస్తామంటూ ప‌ర్స‌న‌ల్‌గా కూడా తీవ్ర బెదిరింపులు వ‌స్తుండ‌డంతో స‌ల్మాన్‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేదు. చుట్టూ భారీ భద్రత మధ్య సల్మాన్ రోజులు వెళ్లదీస్తున్నారు.

Updated Date - May 18 , 2025 | 07:55 AM