Salman Khan: ఆరోగ్య సమస్యలన్నీ తట్టుకుంటూ..
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:24 PM
సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి స్పందించారు. వివాహం, విడాకులు, భావోద్వేగపరంగా, ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలు అని ఆయన అన్నారు.
బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్‌ఖాన్ (Salman khan). ఆయన పెళ్లి గురించి ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటుంది. 59 ఏళ్ల దాటుతున్నా పెళ్లి చేసుకోకపోవడంపై ఎప్పుడు చర్చ జరుగుతుంది. దీనిపై బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. వివాహం, విడాకులు, భావోద్వేగపరంగా, ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలు అని ఆయన అన్నారు. వాటిని ముందుకు తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఈ మేరకు ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ’ (kapil Sharma Show) షోలో పాల్గొన్న సల్మాన్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. అయితే సల్మాన్ మొదటిసారి సల్మాన్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చారు. తాను ‘ఏవీ మాల్ప్ఫోర్మేషన్’ (AV malformation) ‘బ్రెయిన్ ఎన్యోరిజమ్’తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు.
‘‘ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు తరచూ గాయాలు అవుతుంటాయి. ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి (ట్రైజెమినల్ న్యూరల్జియా) ఏవీ మాల్ఫోర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి), బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య) ఉన్నప్పటికీ నేను వర్క్ కొనసాగిస్తున్నా. ఎన్ని ఇబ్బందులున్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే దానిని అధిగమించేవాడిని. ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నా’’ అని ఆయన అన్నారు.
తదుపరి తన స్నేహితుడు ఆమిర్ ఖాన్ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు. ‘‘ఆయనొక అద్భుతమైన వ్యక్తి. పర్‌ఫెక్షనిస్ట్ అని ఈ ప్రపంచానికి తెలుసు. వివాహం విషయంలోనూ పర్‌ఫెక్షన్ వచ్చే వరకూ ఆయన ఈ బంధం కొనసాగించేలా ఉన్నారు. నాకు తెలిసి ఇదే ఆయన చివరి లవ్‌స్టోరీ అవ్వొచ్చు. ఈసారి తప్పకుండా రిలేషన్‌షిప్‌లో పర్‌ఫెక్షన్ పొందుతారు అనుకుంటా’’ అని సల్మాన్ నవ్వులు పూయించారు.