Saif Ali Khan: రూ.15 వేల కోట్ల వారసత్వ ఆస్తి.. సైఫ్‌కు చుక్కెదురు..

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:33 PM

మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్‌ అలీఖాన్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థ్థానం కొట్టి వేసింది.

మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా (Enemy property)పేర్కొనాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్‌ అలీఖాన్‌ 9Saif ali khan) వేసిన పిటిషన్‌ను న్యాయస్థ్థానం కొట్టి వేసింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై విచారణ మరోసారి జరపాలనీ, సంవత్సరంలో తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. దీంతో సైఫ్‌ అలీఖాన్‌కు హైకోర్టులో చుక్కెదురైనట్లు అయింది. ఈ పరిణామంతో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది. భోపాల్‌లో సైఫ్‌ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్‌ నుంచి విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. అక్కడి చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ కుమార్తె సాజిదా.

ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్‌ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖర్‌ అలీఖాన్‌(సైఫ్‌ తాత)ను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఈ క్రమంలో ఆమె వారసులైన సైఫ్‌ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్థ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్‌కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్‌ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ కార్యా?యం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్‌ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇప్పుడు దానిని కోర్టు కొట్టి వేసింది.

Updated Date - Jul 05 , 2025 | 04:34 PM