Bollywood: పూజాహెగ్డే తర్వాత.. రుక్మిణి వసంత్‌కే ఆ ఘనత
ABN , Publish Date - Dec 12 , 2025 | 08:14 PM
ముంబై అంటే బాలీవుడ్ సెలబ్రిటీల హంగామా, వారిని వెంటాడే పాపరాజీల కల్చర్ అందరికీ తెలిసిందే. ఏ నటుడు, నటి పబ్లిక్‌లోకి వచ్చినా, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా, వారిని వెంబడించి ఫోటోలు, వీడియోలు తీయడం అక్కడ సాధారణ దృశ్యం.
ముంబై అంటే బాలీవుడ్ (Bollywood) సెలబ్రిటీల హంగామా, వారిని వెంటాడే పాపరాజీల(Paparazzi) కల్చర్ అందరికీ తెలిసిందే. ఏ నటుడు, నటి పబ్లిక్‌లోకి వచ్చినా, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా, వారిని వెంబడించి ఫోటోలు, వీడియోలు తీయడం అక్కడ సాధారణ దృశ్యం. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి దక్షిణాది నగరాల్లో ఎయిర్ పోర్ట్ లో సెలబ్రిటీలు కనిపించినా, ముంబైలో ఉన్నంత హడావిడి కనిపించదు. కానీ ముంబైలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సెలబ్రిటీలు పబ్లిక్ లో కనిపించారంటే చాలు, వారి వీడియోలు, ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ వీడియోలు చూసి నెటిజన్లు.. 'వామ్మో ఈ సెలబ్రిటీలకు ఇంత క్రేజ్ ఉందా!' అని ఆశ్చర్యపోతారు. మరికొంతమంది, ఈ ఫోటోగ్రాఫర్లు సెలబ్రిటీలను ఎందుకు అంతగా ఇబ్బంది పెడుతున్నారు అని కామెంట్ చేస్తారు.
అయితే, ఈ పాపరాజీ హంగామా వెనుక ఉన్న అసలు కారణాన్ని ప్రముఖ హీరోయిన్ ప్రియమణి(Priyamani) బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబైలో సెలబ్రిటీలు తమకు పబ్లిసిటీ పెంచుకోవడం కోసం, ఆయా పాపరాజీలను డబ్బులు ఇచ్చి మరీ నియమించుకుంటారు అనే విషయాన్ని ఆమె వెల్లడించారు. ప్రియమణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ పాపరాజీలు ఇప్పుడు సెలబ్రిటీలతో మరింత స్పెషల్ బాండింగ్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేస్ లలో సెలబ్రిటీలకు సడన్ బర్త్ డే సర్ ప్రైజ్ లు ఇవ్వడం ఒక ట్రెండ్ గా మారింది.
మొన్నా మధ్య ముంబై ఎయిర్ పోర్టులో పూజా హెగ్డే(Pooja Hegde) పుట్టినరోజు సందర్భంగా పాపరాజీలు ఆమె చేత కేక్ కట్ చేయించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సర్ ప్రైజ్ కు పూజా హెగ్డే ఉప్పొంగిపోయింది. తాజాగా, పాపరాజీల సర్ ప్రైజ్ ను అందుకున్న జాబితాలో చేరింది మరో హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasant). 'కాంతార చాప్టర్-1'(Kantara Chapter-1)లో యువరాణి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్(Rukmini Vasant) పుట్టినరోజు ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రాలో ఆమెను కలిసిన పాపరాజీలు హఠాత్తుగా కేక్ తీసుకొచ్చి ఆమె చేత కట్ చేయించారు. ఈ సర్ ప్రైజ్ తో మురిసిపోయింది రుక్మిణి వసంత్. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
రుక్మిణి వసంత్ గురించి చెప్పాలంటే... ఆమె తెలుగు ప్రేక్షకులకు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన 'మధరాసి'సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. అయితే, కన్నడ చిత్రం 'కాంతార చాప్టర్ 1'తో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టు 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి, పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలు పాపరాజీలను నియమించుకుంటున్నారనే ప్రియమణి(Priyamani) వ్యాఖ్యలు నిజమో కాదో తెలియదు కానీ, ఈ సడన్ బర్త్‌డే సర్ప్రైజ్‌ల ట్రెండ్ మాత్రం సెలబ్రిటీలకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతోంది అనడంలో సందేహం లేదు.