Rohit Sharma - Allu Sirish: రోహిత్ శర్మతో అల్లు శిరీష్‌ యాడ్

ABN , Publish Date - Dec 11 , 2025 | 08:41 PM

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్‌(Allu Sirish) కలిసి నటించిన యాడ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్‌(Allu Sirish) కలిసి నటించిన యాడ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీమా రంగంలో ప్రముఖ సంస్థ తమ కొత్త ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరని ఒకే వేదికపైకి తీసుకురావడం విశేషం. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్(Axis Max Life)యాడ్ లో భాగంగా 'భరోసా తుమ్' అనే థీమ్‌ను ఎంచుకుంది. ఈ యాడ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) తన భార్య రితికా సజ్దేహ్‌(Ritika Sajdeh)తో కలిసి ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పుడు వారికి అల్లు శిరీష్‌ కూడా తోడయ్యారు. దక్షిణాది మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త తరం ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు అల్లు శిరీష్‌ను ఈ ప్రచారంలో చేర్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ యాడ్ ఫిల్మ్ ద్వారా కుటుంబ భద్రత, నమ్మకం అనే అంశాలపై ప్రధానంగా సందేశాన్ని అందించారు. ఈ యాడ్‌లో శిరీష్‌ పాత్ర కూడా కుటుంబ విలువలు, భరోసాను ప్రతిబింబిస్తుంది.

టీమిండియా క్రికెర్ గా రోహిత్ శర్మ దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందారు. అల్లు శిరీష్ కూడా యువ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యే స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు కలిసి నటించడంతో, ఈ యాడ్ ఫిల్మ్ మరింత మందికి చేరువవుతుందని, ముఖ్యంగా దక్షిణాది మార్కెట్‌లో తమ బ్రాండ్‌కు బలమైన అనుబంధాన్ని పెంచుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, అల్లు శిరీష్‌ను చూసిన అభిమానులు ఈ యాడ్ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ ఫ్యామిలీతో అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. మరి కొంతమంది వాళ్లు బంధువులు అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు అల్లు శిరీష్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనికను ఆయన వివాహం చేసుకోనున్నారు. అక్టోబర్ 31వ తేదీన అల్లు శిరీష్‌, నయనికల నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. శిరీష్‌, నయనికల వివాహం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా వివాహ తేదీ, వేదిక వివరాలను అల్లు కుటుంబం ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Dec 11 , 2025 | 09:01 PM