Rhea chakraborty: రియా ఛాప్టర్ 2 స్టార్ట్స్ అంటూ పోస్ట్..
ABN , Publish Date - Oct 04 , 2025 | 09:31 PM
'తూనీగ తూనీగా’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది రియా చక్రవర్తి. బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఐదేళ్ల క్రితం మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో ఈమె పేరు బాగా పాపులర్ అయింది.
'తూనీగ తూనీగా’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది రియా చక్రవర్తి(Rhea Chakraborty). బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఐదేళ్ల క్రితం మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో ఈమె పేరు బాగా పాపులర్ అయింది. ఆమె సుశాంత్‌ను ప్రేమించిన సంగతి తెలిసిందే! అతని మరణానికి రియా కారణమని కేసు నమోదై జైల్లో ఉంది. సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసింది రియానే అని విమర్శలు కూడా ఉన్నాయి. కేసు విచారణలో ఉన్న కారణంగా రియా చక్రవర్తి ఇన్నాళ్లు మీడియా ముందుకు పెద్దగా రాలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. 'ఐదేళ్ల తర్వాత నా పాస్‌పోర్ట్ నా చేతికి వచ్చింది. నేను గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా పర్సనల్ జీవితంలో ఎన్నో విషయాల పట్ల రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఛాప్టర్ 2 స్టార్ట్ (Rhea Chakraborty Chapter 2) కాబోతోంది. సత్యమేవ జయతే’ అని పోస్ట్ చేసింది.
కేసు విచారణ జరుగుతున్న సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న కోర్టు ఎట్టకేలకు ఆమె పాస్ట్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చారు. ఆ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది రియా. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఐదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అభిమానులు రియాపై ఆగ్రహంతో ఉన్నారు. ఆమె పాస్‌పోర్ట్‌ను షేర్ చేయగానే నెటిజన్లు మండిపడ్డారు. అన్యాయంగా ఒక మంచి వ్యక్తి చనిపోవడానికి మీరు కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో మీరు ఇప్పటికీ పశ్చాతాపం పడుతున్నట్లు కనిపించడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.