Dhurandhar First Look: రణ్‌వీర్ సింగ్ యాక్షన్ బ్లాస్ట్.. అదిరిపోయిన ట్రైలర్!

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:36 PM

కాస్త విరామం త‌ర్వాత బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌ వీర్‌సింగ్ హీరోగా న‌టిస్తున్న‌ భారీ చిత్రం ధ‌మ్‌దార్

Dhurandhar

కాస్త విరామం త‌ర్వాత బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌ వీర్‌సింగ్ (Ranveer Singh) హీరోగా సంజ‌య్ ద‌త్‌, అక్ష‌య్ ఖ‌న్నా (Akshaye Khanna), మాద‌వ‌న్ (R. Madhavan), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) వంటి స్టార్ల అంతా క‌లిసి న‌టిస్తున్న‌ భారీ చిత్రం ధ‌మ్‌దార్ (Dhurandhar). గ‌తంలో యూరీ వంటి చిత్రంతో దేశాన్నిషేక్ చేసిన ఆదిత్య ధర్ (Aditya Dhar) ఈ సినిమాకు ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం చేయ‌డంతో పాటు నిర్మాత‌గా వ్య‌వహ‌రిస్తున్నాడు. త‌మిళ బ్యూటీ చియాన్ విక్ర‌మ్ నాన్న ఫేమ్ సారా అర్జున్ (Sara Arjun) క‌థానాయిక‌గా బాలీవుడ్‌లో అడుగు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ అంటూ 2 నిమిషాల 40 సెక‌న్ల నిడివితో చిన్న‌పాటి ట్రైల‌ర్ (Dhurandhar First Look) విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తే ఆధిత్య ధ‌ర్‌,ర‌ణ్ వీర్ సింగ్ ఏదో భారీగానే ఫ్లాన్ చేసిన‌ట్లుగా క‌నిపించింది. అంతేకాదు ఇటీవ‌ల వ‌చ్చిన కిల్‌, జాన్ విక్‌ల‌ను మించి మైమ‌రిపించే యాక్ష‌న్ సన్నివేశాల‌తో క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఈ వీడియో ఉంది. ఈ ట్రైల‌ర్ చూస్తున్నంత సేపు అహో, ఓహో అనేలా ఉన్న‌ప్ప‌టికీ సినిమా కాన్సెప్ట్ ఏంట‌నేది కొద్దిగా కూడా అర్థం అయ్యేలా లేదు. ఈ వీడియోను అంతా న‌రుక్కోవ‌డాలు, పొడ‌వాలు, పోరాట స‌న్నివేశాల‌తోనే నింపేశారు. కాగా ఈ సినిమా డిసెంబ‌ర్‌5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మీరు ఓ సారి ఈ ధ‌మ్‌దార్ (Dhurandhar) ఫ‌స్ట్ లుక్ వీడియోపై లుక్ వేయండి.

Updated Date - Jul 06 , 2025 | 04:36 PM