Shah Rukh Khan: కింగ్ లో క్వీన్ కీలకపాత్రలో...
ABN, Publish Date - May 19 , 2025 | 10:56 AM
పలు విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించిన షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ ఇప్పుడు 'కింగ్'లో మరోసారి నటించబోతున్నారని తెలుస్తోంది. షారుఖ్ కుమార్తె సుహానా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆమె తల్లిగా రాణీ ముఖర్జీ కనిపించబోతోందట.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), ప్రముఖ నాయిక రాణీ ముఖర్జీ (Rani Mukherji) లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'చల్తే చల్తే', 'కభీ అల్వీదా నా కెహనా' చిత్రాలు చక్కని విజయాన్ని సాధించాయి. అయితే ఈ ఇద్దరు మరోసారి సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా (Aditya Chopra) ను వివాహం చేసుకున్న తర్వాత వీలైనంతవరకూ రాణీ ముఖర్జీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇప్పుడు షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కింగ్' (King)లో ఆమె నటించబోతున్నట్టు సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహానా తల్లిగా రాణీ ముఖర్జీ నటించబోతోందట. అలానే షారూఖ్ ఖాన్ సైతం ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించిందని, కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
Also Read: Thug Life: కమల్, అభిరామి లిప్ లాక్... నెటిజన్స్ ఫైర్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి