Ranbir kapoor: బ్యాగ్రౌండ్‌ ఉన్నా.. కష్టం మామూలే..

ABN , Publish Date - Oct 09 , 2025 | 08:09 PM

సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి, నేపథ్యం అనే టాపిక్‌, బ్యాగ్రౌండ్‌తో వచ్చిన ఆర్టిస్ట్‌లు ఈజీగా సక్సెస్‌ అవుతారని తరచూ వినిపిస్తోంది. ఈ విషయంపై బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌కపూర్‌ స్పందించారు.

Ranbir Kapoor

సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి, నేపథ్యం (Nepotism) అనే టాపిక్‌, బ్యాగ్రౌండ్‌తో వచ్చిన ఆర్టిస్ట్‌లు ఈజీగా సక్సెస్‌ అవుతారని తరచూ వినిపిస్తోంది. ఇది బాలీవుడ్‌లో మరింత ఎక్కువ. తాజాగా ఓ కార్యక్రమంలో ఈ విషయంపై బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor) స్పందించారు. ‘నేను కపూర్‌ ఫ్యామిలీలో పుట్టినా, నాకు అది ఒక సాధారణ కుటుంబలాగే అనిపిస్తుంది. ఇంట్లో సినిమాకు సంబంధించి కుటుంబ సభ్యులు మధ్య చాలా చర్చలు జరిగేవి. ఒక సన్నివేశం, ఒక పాట ఇలా చాలా విషయాలను చర్చించేవారు.

‘ఫిల్మ్‌ మేకింగ్‌ ఒక పెళ్లిలాంటిది. నటీనటులందరూ కలిసి పాల్గొనేది. అది ఒక నమ్మకం, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడం’ అని ముత్తాత పృథ్వీరాజ్‌ కపూర్‌ చెప్పేవారని మా ఇంట్లో వాళ్లు చెబుతుంటారు. సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ప్రత్యేక, వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకోకపోతే సినిమా ఇండస్ట్రీలో విజయం సాధించడం అంత ఈజీ కాదు. నేను సినీ వారసత్వానికి చెందిన వాడిని కావడంతో. అవకాశాలను ఈజీ అందుకోగలిగాను. అలాగని నేను పని చేయకుండా సక్సెస్‌ రాలేదు. నేనెప్పుడూ కష్టపడుతూనే ఉన్నాను. నా కుటుంబం సాధించిన ఎన్నో విజయాలను మీరు కూడా ఆనందంగా జరుపుకొని ఉంటారు. కానీ, అదే సమయంలో అపజయాలను చూశాం. సక్సెస్‌ మనకు ఎంత నేర్పిస్తుందో ఫెయిల్యూర్‌ కూడా అంతే నేర్పిస్తుంది. మీరు ఏది చేసినా, తర్వాతి తరాల్లో స్ఫూర్తినింపాలి. అంతకుమించిన గొప్ప పని మరొకటి లేదు’ అని రణ్‌బీర్‌ కపూర్‌ అన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 08:09 PM