Ranbir Kapoor: రణ్‌బీర్‌.. జాతీయ మానవహక్కుల కమిషన్‌

ABN , Publish Date - Sep 22 , 2025 | 09:50 PM

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారన్న జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆయనపై చర్యలకు సిద్థమైంది.

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారన్న జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ-NHRC) ఆయనపై చర్యలకు సిద్థమైంది. అతడిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది. షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ తెరకెక్కించిన ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్‌సిరీస్‌లో రణ్‌బీర్‌ అతిథి పాత్ర పోషించారు. ఈ సిరీస్‌ ఈ నెల 18న విడుదలైంది. ఇందులో ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల చట్టాన్ని అతిక్రమించి, ఇ-సిగరెట్‌ను వినియోగిస్తూ రణ్‌బీర్‌ నటించడంపై ఆయనతోపాటు ఆ సిరీస్‌ నిర్మాతలు ‘నెట్‌ఫ్లిక్స్‌’ ఓటీటీ పైనా కేసు నమోదు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.

యువతను తప్పుదోవ పట్టించే ఈ తరమా కథలను ఎంకరేజ్‌ చేయకూడదని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. భారత్‌లో 2019లో ఎలక్ర్టానిక్‌ సిగరెట్ల నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. దీని కింద ఇ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకాలు, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై నిషేధం ఉంది. ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’తోనే ఆర్యన్‌ఖాన్‌ దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. లక్ష్య, బాబీ దేవోల్‌, సహేర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ తదితరులతోపాటు టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి సందడి చేయడం విశేషం.

Updated Date - Sep 22 , 2025 | 09:50 PM