Rakul Preet Singh: పెళ్లి తర్వాత.. ఎక్స్ ఫోజింగ్ తప్పుకాదు! నాకు మరింత అందం వచ్చింది
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:12 PM
వివాహం తర్వాత గ్లామర్‌గా కనిపించడం, ఎక్స్పో జింగ్ చేయడంలో తప్పులేదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయ పడింది.
వివాహం తర్వాత గ్లామర్‌గా కనిపించడం, ఎక్స్పో జింగ్ చేయడంలో తప్పులేదని, అసలు పెళ్లి తర్వాతే మరింత గ్లామర్ వస్తుందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) అభిప్రాయ పడింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అలరించి ఇప్పుడు హిందీ సినిమాలే ఎక్కువగా చేస్తున్న ఈ బ్యూటీ గతేడాది ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి సైతం చేసుకుని అక్కడే స్థిరపడింది. ఇటీవల సౌత్‌పై ఎక్కువ దృష్టి పెట్టని ఈ భామ కేవలం హిందీ సినిమాలకే పరిమితమైంది. ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తనిత్యం గ్లామర్ డోస్ అంతకంతకు పెంచుతూ ఫాలోవర్స్‌కు అదిరే కిక్ ఇస్తోంది.
అయితే.. ఇటీవల ఓ హిందీ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో బాగా హట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లా డుతూ.. ఎక్స్‌ఫోజింగ్ హీరోయిన్ల కెరీర్ పురోభివృ ద్ధికి ఏమాత్రం అడ్డంకి కాదని అన్నారు. నేను మాత్రం వివాహం తర్వాత నాకు మరింత అందం, గ్లామర్ వచ్చినట్టుగా భావిస్తున్నా. పైగా పెళ్లి తర్వాత గ్లామర్‌గా కనిపించడం, ఎక్స్ ఫోజింగ్ చేయడంలో తప్పులేదు' అని ఆమె అభిప్రాయ పడ్డారు. రకుల్ (Rakul Preet Singh) వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు వివిద రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.