Priyanka Chopra: వర్జిన్ భార్య వివాదం.. ఎట్టకేలకు స్పందించిన ప్రియాంక

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:49 PM

ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త నిజమో.. ఏ వార్త నిజం కాదో అనేది తెలిసేది కాదు. ఇప్పుడు AI వచ్చాక అసలు మనుషులు నిజమో కాదో తెలియకుండా పోయింది.

Priyanka Chopra

Priyanka Chopra: ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త నిజమో.. ఏ వార్త నిజం కాదో అనేది తెలిసేది కాదు. ఇప్పుడు AI వచ్చాక అసలు మనుషులు నిజమో కాదో తెలియకుండా పోయింది. ఇప్పుడున్న కాలంలో సెలబ్రిటీలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ చిన్న వాక్యం తప్పుగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ను తట్టుకోవడం చాలా కష్టం. ఇక కొంతమంది అయితే సెలబ్రిటీలు ఏది చెప్పకపోయినా చెప్పినట్లు AI ద్వారా వారి ముఖాలను వాడేస్తున్నారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది.


ప్రియాంక చోప్రా.. అమెరికా కోడలిగా మారాకా హాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యింది. ఆంగ్ల ఇంటర్వ్యూలలోనే మాట్లాడడం మొదలుపెట్టింది. అలా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక.. వర్జిన్ వైఫ్ గురించి మాట్లాడింది. 'కన్యగా ఉన్న భార్య కోసం వెతక్కండి. మంచి మర్యాద తెల్సిన భార్య కోసం వెతకండి. కన్యత్వం అనేది ఒక్క రాత్రిలో పోతుంది. మర్యాద జీవితాంతం ఉంటుంది' అని మాట్లాడింది. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ప్రియాంక పై ట్రోలింగ్ కూడా నడించింది. ఇంత పచ్చిగా మాట్లాడడానికి సిగ్గులేదా అని నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు.


అయితే ఈ వ్యాఖ్యలు ప్రియాంక అనలేదు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా వెల్లడించింది. వర్జిన్ వైఫ్ వివాదంపై ప్రియాంక స్పందించింది. అసలు తానెప్పుడూ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని చెప్పుకొచ్చింది. ' ఇది నేను కాదు, నా వాయిస్ కాదు. ఆన్‌లైన్‌ లో వస్తున్న ఈ వార్త నిజం కాదు. ఇలాంటి ఫేక్ కంటెంట్ ను సృష్టించి వైరల్ అవ్వడమే సులభమైన మార్గమని కొందరు భావిస్తున్నారు. ఈ వివాదం గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఏ వార్త కూడా నిజం కాదు. అలాంటివేమీ నమ్మకండి. అలాంటి కంటెంట్ వస్తే ఒకసారి క్రాస్ చెక్ చేయడానికి ఒక నిమిషం కేటాయించండి. మీకు వచ్చే ప్రతి వార్తను నమ్మవద్దు. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 లో హీరోయిన్ గా నటిస్తోంది.

Updated Date - Jun 28 , 2025 | 05:49 PM