scorecardresearch

Big War: సీనియర్ స్టార్స్ వర్సెస్ యంగ్ హీరోస్

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:42 PM

నటుడిగా రజనీకాంత్ స్వర్ణోత్సవం చేసుకుంటున్నాడు. అలానే హృతిక్ రోషన్ సైతం హీరోగా రజతోత్సవం జరుపుకుంటున్నాడు. వీరిద్దరి సినిమాలు ఆగస్ట్ 14న ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి.

Big War: సీనియర్ స్టార్స్ వర్సెస్ యంగ్ హీరోస్

ఈ యేడాది పంద్రాగస్ట్ యమ రంజుగా ఉండబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) 'వార్ -2' (War -2) మూవీ, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajini Kanth) 'కూలీ' (Coolie)ని ఢీకొట్టబోతోంది. దాంతో సినీ అభిమానులందరి చూపు ఆగస్ట్ 14 రాబోతున్న ఈ సినిమాల మీదనే ఉంది. 74 సంవత్సరాల రజనీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి యాభై యేళ్ళు పూర్తవుతోంది. 1975లో వచ్చిన 'అపూర్వ రాగాంగళ్' ఆయన తొలి చిత్రం. అది ఆ యేడాది ఆగస్ట్ 15న విడుదలైంది. అంటే ఈ యేడాది ఆయన స్వర్ణోత్సవం చేసుకోబోతున్నారు. విశేషం ఏమంటే... రజనీకాంత్ 'కూలీ' ఆయన నటిస్తున్న 171వ సినిమా. ఇది ఆగస్ట్ 14న విడుదల కాబోతోందని వార్తలొస్తున్నాయి. మార్చి 17న ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశామని మేకర్స్ తెలిపారు.

war2 copy.jpg

'కూలీ' సినిమాలో రజనీకాంత్ తో పాటు సత్యరాజ్ (Satyaraj), నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), సౌబిన్ సాహిర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమీర్ ఖాన్ (Aamirkhan), పూజా హెగ్డే (Pooja Hegde) సైతం ప్రత్యేక పాత్రలలో కనిపిస్తారని తెలుస్తోంది. శ్రుతీహాసన్, రెబా మోనికా జాన్ ఇందులో కీ-రోల్ ప్లే చేస్తున్నారు. లోకేశ్‌ కనకరాజ్ తెరకెక్కిస్తున్న 'కూలీ' సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీతో ఇప్పుడు 'వార్ -2' పోటీపడబోతోంది.


మొన్నటి వరకూ ఆగస్ట్ 14న రావాల్సిన 'వార్ -2' ఆ టైమ్ కు వస్తుందో రాదో అనే సందేహం బాలీవుడ్ వర్గాలలో ఉండేది. ఇందులో కీలక పాత్రలు పోషించిన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా మధ్యలో గాయాల పాలయ్యారు. దాంతో కొన్ని షెడ్యూల్స్ అప్ సెట్ అయ్యాయి. ఈ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ మేకర్స్ తాజాగా 'వార్ -2' ఆగస్ట్ 14నే రిలీజ్ చేస్తున్నామని కన్ ఫర్మ్ చేశారు. రజనీకాంత్ చిత్రసీమలోకి అడుగుపెట్టి యాభై యేళ్ళు అయితే... చిత్రసీమకే చెందిన హృతిక్ రోషన్ తొలి చిత్రం 'కహోనా ప్యార్ హై' విడుదలై పాతికేళ్ళు అయ్యింది. అలానే ఎన్టీఆర్ బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా... హీరోగా పరిచయం అయ్యి 24 ఏళ్ళు అవుతోంది. వీరిద్దరూ ఇప్పుడు సీనియర్ స్టార్స్ నటించిన 'కూలీ'కి పోటీగా నిలబడబోతున్నారు. మరి 'కూలీ'కి 'వార్ -2' ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి. అయితే... ఉత్తరాదిన 'వార్ -2' మూవీ, దక్షిణాదిన 'కూలీ'ది పైచేయి కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Aadi Saikumar: షణ్ముఖ చిత్రంలో ఎ.ఐ. సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 01:51 PM