Nora Fatehi: కారు ప్రమాదం.. బాహుబలి బ్యూటీ సేఫ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:57 PM
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Nora Fatehi: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ తో అమ్మడు ఎంతో గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీగా కొనసాగుతున్న నోరా గతరాత్రి కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో ఉన్న ఒక కారు డ్రైవర్.. నోరా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నోరా చిన్న చిన్న గాయాలతో బయటపడింది. ఈ కారు ప్రమాదం గురించి తెలియడంతో అభిమానులు నోరాకు ఏం అయ్యిందో అని భయాందోళనలకు గురయ్యారు.
తాజాగా నోరా ఈ ప్రమాదంపై స్పందించింది. 'ఈ ప్రమాదం నుంచి నేను సేఫ్ గా బయటపడ్డాను. ఒక్కసారిగా నేను కారులో నుంచి ఎగిరిపడ్డాను. నా తల కారు అద్దానికి గుద్దుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను. చిన్న చిన్న గాయాలయ్యాయి. కానీ, నేను సేఫ్ గా ఉన్నాను. అతడు మద్యం మత్తులో నన్ను మాత్రమే కాదు. చాలామందిని ఇలానే ఢీకొట్టాడు. దయచేసి మద్యం సేవించి డ్రైవ్ చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నోరా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.