Sonakshi Sinha: మే నెలాఖరులో నికితా రాయ్....
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:33 PM
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'నికితా రాయ్' మే 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఆమె సోదరుడు కుశ్ డైరెక్ట్ చేశాడు.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇప్పటికే పలు దక్షిణాది చిత్రాలలో నటించింది. అయితే తొలిసారి ఆమె తెలుగులో 'జటాధర' చిత్రంలో నటిస్తోంది. సుధీర్ బాబు (Sudheer babu) హీరోగా ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. 'జటాధర'లో వైవిధ్యభరితమైన పాత్రను చేస్తున్న సోనాక్షి సిన్హా మరో హిందీ చిత్రంలోనూ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. 'నికితా రాయ్' (Nikita Roy) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాక్షితో పాటు పరేశ్ రావెల్ (Paresh Rawal), అర్జున్ రామ్ పాల్ (Arjun Rampal), సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మే 30న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఎన్.వి.బి.ఎఫ్. సమర్పణలో నిర్మితమౌతున్న 'నికితా రాయ్' మూవీని సోనాక్షి సిన్హా సోదరుడు కుశ్ ఎస్. సిన్హా డైరెక్ట్ చేశాడు. మెయిన్ స్ట్రీమ్ హిందీ సినిమాలు టచ్ చేయని అంశాలను 'నికిత రాయ్' మూవీలో చూపించబోతున్నామని, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు నిక్కీ భగ్నాని, విక్కీ భగ్నాని చెబుతున్నారు. ఈ మూవీకి పవన్ కృపలాని రచన చేశారు.
Also Read: Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం
Also Read: Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి