Netflix - WBD: నెట్‌ఫ్లిక్స్ ఆ పెద్ద కంపెనీనే కొనేసింది..
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:04 PM
ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకునే డీల్ పూర్తి చేసింది. 83 బిలియన్ డాలర్లకు ఫిల్మ్, టెలివిజన్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసింది.
ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్(Netflixs), వార్నర్ బ్రదర్స్ (Warner Bros) కంపెనీని సొంతం చేసుకునే డీల్ పూర్తి చేసింది. 83 బిలియన్ డాలర్లకు ఫిల్మ్, టెలివిజన్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ పదేళ్ల కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో జరిగిన అది పెద్ద డీల్ ఇది. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్, ఫిల్మ్ స్టూడియోలు, టెలివిజన్ స్టూడియోలు, హెచ్‌బీఓ మాక్స్, హెచ్‌బీఓతో కలిపి పూర్తిగా కొనుగోలు ఇరు సంస్థలు ప్రకటన చేశాయి. ఓటీటీలో అగ్రస్థాయిలో ఉంటూ ఆదిపత్యం చలాయించిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ బ్యానర్‌తో థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతోంది.
ఈ క్యాష్, స్టాక్ ట్రాన్సాక్షన్ WBD షేర్ విలువను $27.75గా నిర్ధారించగా, మొత్తం కొనుగోలు విలువ సుమారు $82.7 బిలియన్ గా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 8 లక్షల కోట్లు అవుతుంది. ప్రపంచ వినోద రంగ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. చివరికి ఇరు సంస్థలు అన్ని షరతులపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌కు ఒక పెద్ద మలుపు. ఇప్పటివరకు గ్లోబల్ OTT రంగంలో ఆధిపత్యం చాటిన నెట్‌ఫ్లిక్స్, ఈ ఒప్పందంతో వార్నర్ బ్రదర్స్ లేబల్ ద్వారా థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టనుంది. దీనివల్ల వినోద రంగంపై, ముఖ్యంగా సాంస్కృతికంగా, ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.
1997లో నెట్‌ఫ్లిక్స్ మామూలు డీవీడీ రెంటల్ సర్వీస్‌గా మొదలైంది. మారుతున్న రోజులు, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తన శైలిని మార్చుకుంటూ వినోద రంగంలో ఒక్కో మెట్టు ఎక్కింది. తదుపరి ఆన్‌లైన్ స్ట్రీమింగ్గ్ వైపు అడుగుపెట్టింది. ఓటీటీల్లో ఓ సంచలనంగా మారి ప్రేక్షకులు కంటెంట్ చూేస విధానాన్ని పూర్తిగా మార్చేసింది. తరువాత ఒరిజినల్ కంటెంట్ నిర్మాణం మొదలుపెట్టి, ప్రపంచస్థాయిలో హిట్ సిరీస్‌లతో అలరించింది. అన్ని దేశాల్లోనూ చందాదారులను పొందింది.