MAA TRAILER: బాలీవుడ్ నుంచి మరో హర్రర్.. భయపెట్టేందుకు వస్తున్న కాజోల్
ABN , Publish Date - May 29 , 2025 | 06:06 PM
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ నిర్మాణంలో రూపొందిన చిత్రం మా.
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ దేవ్‌గణ్ (Kajol Tanuja Devgn) ప్రధాన పాత్రలో అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Veena Devgn) నిర్మాణంలో రూపొందిన చిత్రం మా (Maa). హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రాకి విశాల్ పూరియా (Vishal Revanti Furia) దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు.
గత సంవత్సరం అజయ్ దేవగణ్, జ్యోతిక, మాదవన్ కీలక పాత్రల్లో వచ్చి సంచలన విజయం సాధించిన షైతాన్ సినిమాల వరుసలో ఈ సినిమా రూపొందండం విశేషం. తన కూతురితో కలిసి ఓ విలేజ్‌కు వచ్చిన తల్లికి ఆ ఊర్లో వింత పరిస్థితులు ఎదురవుతాయి. అతీత శక్తులతో పోరాడాల్సి వస్తోంది. ఈక్రమంలో ఆ తల్లి తన కూతురి కోసం ఒంటరిగా చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా ఉండనుంది. అయితే ఈ మూవీ కథ బేస్ లైన్‌ను ఆదర్శంగా తీసుకుంటూ ఈ సినిమాలో పని చేసిన వారంతా తమ పేర్ల చివరన వారి మాతృమూర్తుల పేర్లు పెట్టుకోవడం విశేషం. గతంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సమయం లోనూ అంతా ఇదే పద్దతిని పాటించడం గమనార్హం.