Deepika Padukone: దీపికా డిమాండ్.. సపోర్ట్ చేసిన దర్శకుడు

ABN , Publish Date - Jun 13 , 2025 | 08:55 PM

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) తన వర్కింగ్‌ అవర్స్‌, భారీ పారితోషికం డిమాండ్‌ చేశారని, అందువల్లే ఆమెను ఓ చిత్రబృందం తొలగించిందని గతంలో ప్రచారం జరిగింది.


బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) తన వర్కింగ్‌ అవర్స్‌, భారీ పారితోషికం డిమాండ్‌ చేశారని, అందువల్లే ఆమెను ఓ చిత్రబృందం తొలగించిందని గతంలో ప్రచారం జరిగింది. ఓ చిత్రం కోసం దీపికా రూ.25 కోట్లు డిమాండ్‌ చేయడంపై కబీర్‌ఖాన్‌ ((Kabir Khan) supports) తన అభిప్రాయాన్ని తెలిపారు.  ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు తగిన పారితోషికానికి అర్హులు. వ్యక్తులను చూసి కాకుండా వారికి ఉన్న స్టార్‌డమ్‌ చూసి రెమ్యూనరేషన్‌ ఇవ్వాలి’’ అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ర్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై దీపికా ఎక్కడా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఈ విషయాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Deepina-2.jpg
 
‘‘నేను 500 మంది సిబ్బందితో కలిసి పని చేస్తున్నారు. సినీ రంగంలోని వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి. వారికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. వర్కింగ్‌ అవర్స్‌ విషయంలో దీపికా డిమాండ్‌ న్యాయమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లే కూడా 8 గంటల షిఫ్ట్‌లోనే పని చేస్తారు. దీపికా విషయంలో ఇది ఎందుకు తప్పు గా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని నిరాకరించడానికి దర్శకులకు సరైన కారణం ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారు షూటింగ్‌ల కోసం వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే విషయాన్ని నేను అంగీకరించను. నేనెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. అలాగే, ఆదివారాల్లోనూ చిత్రీకరణ చేయను’’ అని అన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 09:00 PM