Javed akhtar: నా నగరం తగలబడటం కళ్లారా చూశా..
ABN, Publish Date - May 02 , 2025 | 07:02 PM
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ (Javed Aktar) పహల్గాం ఉగ్రదాడిలో (pahalgam) పాకిస్థాన్ హస్తం ఉందని అన్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ (Javed Aktar) పహల్గాం ఉగ్రదాడిలో (pahalgam) పాకిస్థాన్ హస్తం ఉందని అన్నారు. గతంలో ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు బలమైన ఔంటర్ ఇచ్చినట్లు చెప్పారు. ‘‘ఒకసారి నేను లాహోర్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యా. అక్కడ మంచి ప్రశ్నలు అడుగుతారేమోనని ఆశించా. ఓ పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గట్టిగా సమాధానమిచ్చాను. ‘భారతీయులంతా పాకిస్థ్థానీయులను ఉగ్రవాదులుగా భావిస్తున్నారా?’ అని అడిగారు. ‘నేను ముంబయి వాసిని. నా నగరంపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. నా నగరం తగలబడటం నేను కళ్లారా చూశా. ఆ దాడులకు కారణం స్వీడన్, ఈజిప్ట్ నుంచి వచ్చిన వారు కాదు.. వారంతా పాకిస్థాన్ నుంచి వచ్చినవారే. వారు ఇప్పటికీ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని చెప్పాను. ఆ మరుసటి రోజే నేను లాహోర్ నుంచి తిరిగి వచ్చాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే నా కామెంట్స్ పాక్‌లో ఉద్రిక్తతలకు దారి తీశాయని విన్నాను’’ అని చెప్పారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలోనూ జావేద్ అక్తర్ పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన దేశంలో ఏ ప్రభుత్వమైనా శాంతి కోసమే ప్రయత్నిస్తుంది. కార్గిల్ యుద్థం జరిగినప్పుడు వారి దేశస్థుల మృతదేహాలను కూడా పాక్ చిన్నచూపు చూసింది. అలాంటి వారితో స్నేహంగా ఎలా మెలగాలి. 99 శాతం కశ్మీరీలను భారతదేశానికి విధేయులు. ముస్సోరీలో, దేశంలో మరే ప్రాంతాంలోనైనా కశ్మీరీలను వేధించే వారు నా దృష్టిలో పాక్‌కు మద్దతు ఇచ్చేవారే’’ అని జావేద్ అన్నారు.