Janhvi Kapoor: ప్ర‌పంచం చూపంతా ఆమె పైనే.. కేన్స్‌లో అదరగొట్టిన జాన్వీ కపూర్

ABN, Publish Date - May 21 , 2025 | 08:03 AM

శ్రీదేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో త‌న ఎంట్రీతో అద‌ర‌గొట్టింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర ఉత్సవాల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes Film Festival 2025) గ‌త వారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. విశ్వ వ్యాప్తంగా పేరెన్నిక‌గ‌న్న న‌టీన‌టులు హ‌జ‌రై ఈ కార్య‌క్ర‌మానికి కొత్త శోభ‌ తీసుకువ‌స్తున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ నుంచి అనేక మంది టాప్ సెల‌బ్రిటీస్ అటెండ్ అవ‌గా ఇప్పుడు బాలీవుడ్ న‌టీమ‌ణులు ఆ వేదిక‌ను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా మారుస్తున్నారు.

తాజాగా మంగ‌ళ‌వారం శ్రీదేవి గారాల ప‌ట్టి జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor), ఇష‌న్ క‌ట్ట‌ర్ జంట‌గా న‌టించిన ‘హోమ్‌బౌండ్ (Homebound) సినిమా ప్రీమియర్ కోసం జాన్వీ కేన్స్‌లో తొలిసారి అడుగు పెట్టింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన మెటాలిక్ పింక్ కలర్ ప్రీ-డ్రేప్డ్ సారీతో జాన్వీ రెడ్ కార్పెట్‌పై న‌డిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక జాన్వీ కారు దిగింది మొద‌లు వేల కొద్ది కెమెరాలు జాన్వీ చుట్టూనే తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. కాగా మ‌రో నాలుగు రోజులు మే 24 వ‌ర‌కు ఈ కేన్స్‌ ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

Updated Date - May 21 , 2025 | 08:12 AM