Janhvi Kapoor: ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్‌పై జాన్వీ ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:19 AM
నెపోటిజం, బ్యాగ్రౌండ్ అనేది సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తూ ఉంటాయి. అది బాలీవుడ్‌లో ఇంకాస్త ఎక్కువ. ఇదే టాపిక్‌పై బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఓ సమిట్‌లో మాట్లాడారు.
నెపోటిజం(Nepotism), బ్యాగ్రౌండ్ అనేది సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తూ ఉంటాయి. అది బాలీవుడ్‌లో ఇంకాస్త ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాగ్రౌండ్ పక్కాగా ఉండాలని కొందరు నమ్ముతారు. అయితే సినీ నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో ఎదుగుతారు కొందరు. స్టార్‌డమ్ ఉన్నా సక్సెస్ కావడానికి కష్టపడాల్సి వస్తుంది మరికొందరు. ఇదే టాపిక్‌పై బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ఓ సమిట్‌లో మాట్లాడారు. తాజాగా ముంబై జరిగిన ఇన్‌సైడర్, అవుట్‌సైడర్’ (Insiders And Outsiders) చర్చలో జాన్వీకపూర్ పాల్గొన్నారు.
‘సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఓ సమస్య ఎదురవుతూ ఉంటుంది. స్టార్‌కిడ్ అనే ట్యాగ్ చాలా ఇబ్బందులు గురి చేస్తుంటుంది. నటీనటులను ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్ అని విభజించడం నాకు ఇష్టం లేదు. బయట నుంచి పరిశ్రమకు వచ్చినవారితో ఇండస్ట్రీ వారి కష్టాలను పోల్చడం అన్యాయం. స్టార్ కిడ్స్ ఇబ్బందులు చెప్పినా వింతగా ఉంటాయి. వాటిని వినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. అయినా ఇండస్టీలో ఉన్న స్టార్ కిడ్స్ ఎవరూ కష్టాలు పడ్డామని చెప్పరు. ఎందుకంటే సినీ నేపథ్యం లేకుండా వచ్చిన వారితో పోల్చితే వారికి లభించిన సౌకర్యాలకు వారెప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు. ‘మేం ఎంతో కష్టపడుతున్నాం’ అని చెబితే ఎవరూ వినరు. అవుట్ సైడర్స్ ఇండస్ట్రీలో గుర్తింపుతెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాలని నేనూ అంగీకరిస్తాను. ఆ పోరాటాలు స్టార్ కిడ్స్‌కు అర్థం కావు’ అని జాన్వీ అన్నారు.
ప్రస్తుతం జాన్వీ హిందీ చిత్రాలతోపాటు దక్షిణాది చిత్రాలతోనూ బిజీగా ఉంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన ‘సన్నీ సంస్కారి కీ తులస కుమారి’ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తోంది.
ALSO READ: Raviteja: రవితేజ అనార్కలి.. పేరు మారిందా?
Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!
Ajith Kumar: భారతీయ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చు..
Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ మరో రికార్డ్