Janhvi kapoor: చావులపై కూడా అత్యుత్సాహం అంటూ జాన్వీ ఫైర్‌

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:16 PM

సెలబ్రిటీలు, పబ్లిక్‌ ఫిగర్స్‌ మరణించినప్పుడు మీడియా వ్యవహరిస్తున్న తీరుపై బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi kapoor) మండిపడ్డారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది.

సెలబ్రిటీలు, పబ్లిక్‌ ఫిగర్స్‌ మరణించినప్పుడు మీడియా వ్యవహరిస్తున్న తీరుపై బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi kapoor) మండిపడ్డారు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. అయితే నెగటివ్‌ వార్త వెళ్లినంతగా పాజిటివ్‌ వార్త వెళ్లదు. తాజాగా ధర్మేంద్ర (Dharmendra) విషయంలో అదే జరిగింది. ఆయన రెగ్యులర్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏకంగా ఆయన కన్నుమూశారని వార్తల్ని ప్రచారం చేశారు. దాంతో సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా నివాళి అర్పించారు. దాంతో ధర్మేంద్ర కూతురు మండిపడుతూ సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసింది. ధర్మేంద్ర నవంబర్‌ 24న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. బ్రతికుండగానే మనిషి చంపేసి, కనీసం ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా ఆ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారంటే  నటి జాన్వీ కపూర్‌ మండిపడ్డారు. ఇదే విషయంపై ఆమె స్పందించారు. తన తల్లి (Sridevi) విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని సోషల్‌ మీడియాపై మండిపడ్డారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్‌ మీడియా తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘నా తల్లి శ్రీదేవి మరణం సమయంలో కూడా కొంతమంది సరదాగా మీమ్స్‌ వేయడం, విషయాన్ని వినోదంగా మార్చడం చూశాను. ఇటీవల ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం గురించి కూడా తప్పుడు వార్తలు ఊహగానాలు ప్రచారం చేస్తూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. ఒకరి బాధ సోషల్‌ మీడియా వారికి సంతోషాన్ని కలిగిస్తోంది’ అంటూ ఆమె విమర్శించింది. బ్రతికున్న వారిని చనిపోయినట్టు చిత్రీకరించడంపై మండిపడింది. జాన్వీ ప్రస్తుతం తెలుగులో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Dec 02 , 2025 | 02:26 PM