Bollywood: దేశం సేఫ్.. మళ్ళీ ఇన్‌స్టాలోకి వచ్చేయండి... ఒక్క పోస్టుతో బాలీవుడ్ పరువు గోవింద
ABN, Publish Date - May 14 , 2025 | 01:05 PM
ఇటీవల మన దేశంలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు గురించి అందరికీ తెలిసిందే. భారత్, పాకిస్తాన్ నడుమ యుద్ధం విషయంలో మన సౌత్ నుంచి అనేకమంది స్టార్స్ గళం విప్పారు.
గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. తీవ్రవాదులు కాశ్మీర్‌లో 28 మంది భారతీయ టూరిస్టులను చంపి వేయడం ఆపై భారత్, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి 100 మందికి పైగా తీవ్రవాదులను చంపివేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను సామాన్య ప్రజానికం నుంచి స్వాగతిస్తూ ఆర్మీకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు ముఖ్యంగా దక్షణాది నటులంతా ఏకతాటి పైకి వచ్చి తమ సోషల్ మీడియాల ద్వారా ఆర్మీకి బాసటగా నిలిచారు. దీంతో చాలామంది సౌత్ యాక్టర్లను ప్రశంసించారు కూడా.
అయితే దేశంలో ఇంత జరుగుతున్నా, యుద్దం, ఆపరేషన్ వంటి కఠిన పరిస్థితులు దేశంలో ఉండగా బాలీవుడ్ (Bollywood) సినీ పరిశ్రమ నుంచి అక్షయ్ కుమార్ మరో ఒకరిద్దరు మినహా ఏ హీరో గానీ హీరోయిన్లు గానీ మరెవరూ స్పందించిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర పోలీస్ (Maharashtra Police) సోషల్ అకౌంట్ పేరుతో ఇన్‌స్టాలో వచ్చిన పోస్టు టోటల్ బాలీవుడ్ పరువును బజారు పాలు చేసింది. ఆ పోస్టులో ఇంతవరకు రెస్పాండ్ అవని బాలీవుడ్ స్టార్ నటుల ఏఐ ఫొటోలు పెట్టి.. డియర్ సెలబ్రెటీస్, ఇప్పుడు దేశమంతా సేఫ్ గా ఉంది. మళ్ళీ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌లలోకి వచ్చేయండి, మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ అప్సెట్ అవకుండా అప్డేట్స్, పోస్టులు చేసుకోండి అంటూ సెటైరికల్‌గా కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు కాస్త తెగ వైరల్ అయి టోటల్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.
ఆ పోస్టు చూసిన వారంతా బాలీవుడ్ (Bollywood) వాళ్లకు జనం డబ్బులు కావాలి, కలెక్షన్లు కావాలి, కోట్లకు కోట్లు రెమ్యునరేషన్స్ కావాలి గానీ ఆపద సమయంలో బాలీవుడ్ స్టార్లు తమ గొంతు వినిపించరా? అంటూ తమదైన శైలిలో చీల్చి చెండాడుతున్నారు. ఈ పోస్టు పెట్టి బాలీవుడ్ నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు ఉంచారని, ఒక్క పోస్టుతో హిందీ పరిశ్రమను డిస్ట్రాయ్ చేశారంటూ సదరు పోలీసులను ప్రశంసిస్తూ రీ ట్వీట్లు చేస్తున్నారు.
వారికి మహారాష్ట్ర పోలీసులు కరెక్ట్ కౌంటర్ ఇచ్చారని పేర్కొంటున్నారు. అయితే.. తీరా ఆ పోస్టు అలా ఎలా పోలీసులు పెట్టారని పలువురు పరిశీలిస్తే అది మహారాష్ట్ర పోలీసుల అధికారిక పేజీ కాదని, నఖీలీ ముంబై పోలీసు ఖాతా అని, అది ఎవరో కావాలని చేసిన పని అని, ఓ ఫ్యాన్ ఫేజీ అని బయటపడడం విశేషం. ఇదిలా ఉండగా ఈ పోస్టుపై మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) ఇంతవరకు రెస్పాండ్ కాకపోవడం కొసమెరుపు.