Jaya Bachchan: ఈతరం మనల్ని మించిపోయి ఉంది..
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:06 PM
ఇప్పటి జనరేషన్‌కు తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, అదే పెళ్లి విషయంలో అయితే అసలు ఆ జోలికే వెళ్లనని సీనియర్ నటి జయాబచ్చన్ అన్నారు
ఇప్పటి జనరేషన్‌కు తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని, అదే పెళ్లి విషయంలో అయితే అసలు ఆ జోలికే వెళ్లనని సీనియర్ నటి జయాబచ్చన్(Jaya Bachchan) అన్నారు. ఈతరం పిల్లల గురించి ‘వి ది విమెన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మనవరాలు నవ్య నవేలి నందా (navya naveki nanda) వివాహం గురించి ఆమె మాట్లాడారు. ‘నవ్య ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించా
లని చెబుతాను. ఆమెకు మరికొన్నిరోజుల్లో 28 ఏళ్లు పూర్తవుతాయి. ఈతరం పిలలకు మాలాంటి వారు సలహా ఇవ్వలేరు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు బాగా మారిపోయాయి. చిన్నపిల్లలు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అన్ని విషయాల్లో పెద్దల్ని మించిపోయారు. ఇక, వివాహం అంటే ఇలానే ఉండాలి అని చట్టబద్థమైన నిర్వచనాలు లేవు. అలా నిర్వచించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయా బచ్చన్ అన్నారు.