Huma Qureshi: డిస్కవరీ కేటగిరీలో తొలి భారతీయ చిత్రం..
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:59 PM
బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బయాన్’ . బికాస్ రంజన్ మిశ్రా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2025కు ఎంపికేౖంది
బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ (Huma Qureshi)ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బయాన్’ (bayaan). బికాస్ రంజన్ మిశ్రా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2025కు (toronto film festival 2025) ఎంపికేౖంది. ఈ నేపథ్యంలో నటి హ్యుమా ఖురేషీతోపాటు యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఒక మహిళ చేసే పోరాటం నేపథ్యంలో సాగే కథ ఇది. నాకు ఎంతో ఇష్టమైన క్యారెక్టర్‌ను పోషించే అవకాశాన్ని బయాన్ చిత్రం ఇచ్చింది. న్యాయవ్యవస్థలోని వ్యక్తి అయినప్పటికీ, పెద్ద శక్తులను ఎదుర్కొనే పాత్ర దక్కింది. ఈ టీమ్‌తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. డిస్కవరీ కేటగిరీతో బయాన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికవడం నాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఇదే విషయంపై దర్శకుడు కూడా స్పందించారు. బయాన్’ను టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడం గర్వంగా ఉంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం డిస్కవరీ విభాగంలో ఎంపికైన ఏకైన భారతీయ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో హ్యుమా ఖురేషీతోపాటు సచిన్ ఖేడ్కర్ చంద్రచూర్‌సింగ్, పరితోష్ సాండ్, అభిజిత్ దత్, మయాంక్, స్వాతి దాస్, అదితి కాంచన్ సింగ్, పెర్రీ చాబ్రా తదితరులు కీలక పాత్రధారులు.