Hrithik Roshan: థ్రిల్లర్ సిరీస్‌తో.. కొత్త జర్నీ ప్రారంభం..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:48 PM
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్థమయ్యాడు. అయితే నటుడిగా కాకుండా నిర్మాతగా ఆయన డిజిటల్‌పై, దృష్టిపెట్టారు
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్థమయ్యాడు. అయితే నటుడిగా కాకుండా నిర్మాతగా ఆయన డిజిటల్‌పై, దృష్టిపెట్టారు. తన సొంత బ్యానర్ హెచ్‌ఆర్‌ఎక్స్ ద్వారా అమేజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియోతో కలిసి ‘స్టార్మ్’ టైటిల్‌తో ఆయన ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నారు. ఆయనకు తొలి డిజిటల్ వెంచర్ ఇది. ముంబై నేపథ్యంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సిరీస్‌లో హృతిక్ స్నేహితురాలు సబా ఆజాద్, అలయా ఎఫ్, మలయాళ నటి పర్వతి తిరువొత్తు, శ్రిష్టి శ్రీవాస్తవ, రామా శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహించనుండగా, ఈషాన్ రోషన్, గౌరవ్ గాంధీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ముంబైలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు హృతిక్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నా. ఓ వెబ్‌సిరీస్‌తో ఓటీటీరంగంలోకి అడుగుపెడుతున్నా. అయితే నటుడిగా కాదు.. నిర్మాతగా వెబ్ సిరీస్ చేస్తున్నా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. (Hrithik Roshan Ott Entry)
ఇటీవల ‘వార్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హృతిక్ రోషన్. తారక్ కీలక పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆయన క్రిష్ సిరీస్‌లో భాగంగా రాబోతున్న ‘క్రిష్ 4’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించడం తో పాటు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.