Saiyami Kher: ఐరన్‌మ్యాన్‌ 70.3.. సయామీ రికార్డు

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:59 PM

కొందరు నాయికలు సినిమా రంగంలో పని చేస్తునప్పటికీ ఇతర రంగాలపైనా ఆసక్తి చూపిస్తుంటారు.  అలా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌ ఉన్న తారల్లో సయామీఖేర్‌ ఒకరు

కొందరు నాయికలు సినిమా రంగంలో పని చేస్తునప్పటికీ ఇతర రంగాలపైనా ఆసక్తి చూపిస్తుంటారు.  అలా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌ ఉన్న తారల్లో సయామీఖేర్‌ ఒకరు(Saiyami Kher). ఆమె ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అన్న విషయం తెలిసిందే! విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొంటుంటారామె. ఏడాది కాలంలో రెండు సార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ (Ironman 70.3) పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పారు. గతేడాది సెప్టెంబరులో మొదటిసారి మెడల్‌ అందుకున్న ఆమె.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం గెలుచుకున్నారు. 1.9 కి.మీ. ఈత, 90 కి.మీ. సైక్లింగ్‌, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగంగా ఉంటాయి. అత్యంత కష్టమైన పోటీలివి. 

తాజాగా ట్రోపీ గెలుపొందిన సయామీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ పోస్ట్‌ పెట్టారు.  క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే అని పేర్కొన్నారు. ‘నేనేంటో ప్రపంచానికి నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేయలేదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. గతేడాది కన్నా ఈ ఏడాది రేస్‌ను 32 నిమిషాల్లో పూర్తి చేశాను’ అని చెప్పారు.  సాయిధరమ్‌ తేజ్‌ ‘రేయ్‌’తో తెలుగుతెరకు పరిచయమాయ్యరు సయామీ. తదుపరి బాలీవుడ్‌లో అవకాశాలు అందుకున్నారు. కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో ‘వైల్డ్‌డాగ్‌’తో తెలుగు ఆడియన్స్‌కు పలకరించారు.  ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాట్‌’లో కీలక పాత్ర పోషించారు 

Updated Date - Jul 08 , 2025 | 06:05 PM