Hanuman Role: హనుమంతుడి పాత్ర 15 నిముషాలేనా
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:46 AM
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న రామాయణ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక కొత్త వార్త బయటకు వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు నితిశ్ తివారీ. ‘రామాయణ’ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా విడుదలయ్యే సినిమా తొలి భాగంలో హనుమంతుడి పాత్ర కేవలం పదిహేను నిముషాలే ఉంటుందనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది. అయితే 2027 దీపావళికి విడుదలయ్యే రెండో భాగంలో మాత్రం ఆయన పాత్ర సమగ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.