Divorce Rumors Denied: గోవిందా దంపతుల విడాకులు... వివరణ
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:48 AM
బాలీవుడ్ హీరో గోవిందా, సునీతా అహూజా విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది..
బాలీవుడ్ హీరో గోవిందా, సునీతా అహూజా విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్నాళ్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పలు సందర్భాల్లో వారిద్దరూ మీడియా కథనాలను ఖండించారు. మరోమారు వారి విడాకుల వార్త బాలీవుడ్ మీడియాలో పతాక శీర్షికలకెక్కింది. కొన్నాళ్లుగా గోవిందా, సునీత విడివిడిగా జీవిస్తున్నారనీ, వారిమధ్య తలెత్తిన మనఃస్పర్ధల కారాణంగా ఇప్పుడు విడాకుల కోసం సునీత బాంద్రా కోర్టును ఆశ్రయించారంటూ బాలీవుడ్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ విడాకుల వార్తలను సునీతా అహుజా ఖండించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, అలాంటిదేమైనా ఉంటే మేమే స్వయంగా చెబుతాం అని ఆమె స్పష్టం చేశారు.