Genelia: రోజుకు 10 గంటలు వివాదం.. దీపికాకు జెనీలియా కౌంటర్
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:58 PM
తెలుగులో కల్కి 2898 AD(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామను.. స్పిరిట్(Spirit) లో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Genelia: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ కాలం ఉంటారు అనేది పాత మాట. ఇప్పుడు ఎన్ని వివాదాల్లో ఉంటే అంత ఎదుగుతారు అనేది కొత్త మాట. చిన్న విషయమైనా.. పెద్ద విషయమైనా వివాదం కావాల్సిందే అని అనుకొనే నటీనటులు లేకపోలేదు. ఇక ఈ మధ్యకాలంలో వివాదల్లోనే మునిగి తేలుతున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి.. అత్యంత అధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగులో కల్కి 2898 AD(Kalki 2898AD) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామను.. స్పిరిట్(Spirit) లో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.అయితే కథ అంతా నచ్చినా దీపికా మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టింది. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడంతో పాటు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ కండీషన్స్ కు వంగా ఒప్పుకోకపోవడంతో ఆమె రివెంజ్ గా స్పిరిట్ స్టోరీని లీక్ చేసింది. దీంతో వంగా.. దీపికా పై ఫైర్ అవ్వడంతో ఈ గొడవ కాస్తా పెద్ద వివాదంగా మారింది. దీపికా 8 గంటల పని విధానంపై పలువురు పలురకాలుగా మాట్లాడారు. కొందరు దీపికాకు మద్దతు పలకగా.. మరికొందరు దీపికాను విమర్శిస్తున్నారు.
ఇక రోజుకు 10 గంటల పని విధానంపై మరో బాలీవుడ్ నటి జెనీలియా తనదైన రీతిలో స్పందించింది. తాజాగా ఆమె సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా మాట్లాడుతూ ' సెట్ లో ఎక్కువ సేపు పని చేయడం అందరికీ కష్టమే. కానీ, అసాధ్యం అయితే కాదు కదా. ఒక్కోసారి నేను 10 గంటలు పనిచేస్తాను. అయినా కూడా మేడమ్.. ఇంకో రెండు గంటలు పని చేస్తారా.. ? అని దర్శకుడు అడిగినప్పుడు .. 12 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది.
మన అవసరం ఉంది అన్నప్పుడు మన సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇలా చేయడం సరైనదే అని నా అభిప్రాయం. ఒక్కోసారి రెండు, మూడు రోజులు కూడా పనిచేయాల్సి వస్తుంది. అది మన వృత్తి" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జెనీలియా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపికాకు మంచి కౌంటర్ ఇచ్చినట్లు జెనీలియా మాట్లాడిందని కామెంట్స్ పెడుతున్నారు.
Oh Bhama Ayyo Rama: జూలై 11న థియేటర్లలోకి.. సుహాస్ ఓ భామ అయ్యో రామ