Farhan Akhtar: హార్సిల్, ధరాలి వరద బాధితులకు ఫర్హాన్ సాయం..
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:00 PM
బహుముఖ ప్రజ్ఞశాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న ఫరాన్ అక్తర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞశాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న ఫరాన్ అక్తర్ (Farhan Akhtar) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వరద బాధితులకు సహాయం అందించారు. బాధితులకు మొబైల్ ఫోన్లు అందించి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాలు జలమయమైన సంగతి తెలిసిందే! ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి ఎంతోమంది నీటిలో కొట్టుకుపోయారు. ఎన్నో కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. కొన్ని కుటుంబాలను ఆదుకోవడం కోసం నటుడు, నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన వంతుగా సహాయం అందించారు. ఉత్తరాఖండ్‌లోని హార్సిల్, ధరాలి, జిల్లా వాసులకు (flood-hit families) 50 ఫోన్‌లు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఆకస్మిక వరదల కారణంగా ఎంతో మంది ప్రజలు జీవనాధారాన్ని, ఇల్లు ఇలా ఎన్నో కోల్పోయారు. అయితే ఒక్క ప్రాంతంలో జరిగే విషయాన్ని మరో ప్రాంతం వారు తెలుసుకోవాలంటే కమ్యూనికేషన్ అనేది అవసరం. ఆ సమీపంలోని బీడీఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో పనిచేసే దివ్యాన్షు ఉపాధ్యాయ అనే వ్యక్తి ఫర్హాన్ అక్తర్ సహాయం కోరడంతో ఆయన వెంటనే స్పందించి.. సుమారు 7000 విలువైన 50 ఫోన్‌లను బాధితులకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఫోన్‌లు అందుకున్న వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని దివ్యాన్షు తెలిపారు.
‘వరదల కారణంగా అన్నీ కోల్పోయాం. ఫర్హాన్ సాయంతో మా బంధువులకు క్షేమ సమాచారాన్ని అందించడానికి వీలైంది. బాధలో ఉన్న మాకు నేనున్నా అనిచచ భరోసా ఇచ్చారు’ అని ఽధరాలి వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయన నిర్మించిన ‘120 బహదూర్ ’ సినిమా నవంబర్‌లో విడుదలకు సిద్ధమైంది.