Kapkapiii: బాలీవుడ్‌లోకి ‘రోమాంచం’! సంగీత్ శివన్ చివరి చిత్రం.. ఎట్టకేలకు థియేటర్లలోకి!
ABN , Publish Date - May 16 , 2025 | 01:43 PM
ప్రముఖ దర్శకుడు, దివంగత సంగీత్ శివన్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ కామెడీ హిందీ చిత్రం కప్కపియి.
ప్రముఖ దర్శకుడు, దివంగత సంగీత్ శివన్ (Sangeeth Sivan) దర్శకత్వంలో రూపొందిన హర్రర్ కామెడీ హిందీ చిత్రం కప్కపియి (Kapkapiii). శ్రేయస్ తల్పడే (Shreyas Talpade), తుషార్ కపూర్ (Tusshar Kapoor), సిద్ధి ఇద్నాని (Siddhi Idnani), జే తక్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం రోమాంచం (Romancham) సినిమాకు రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత సంవత్సరం జూన్‌లోనే విడుద కావాల్సి ఉంది.
అయితే.. ఈ సినిమా షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్స్ సమయంలో దర్శకుడు సంగీత్ శివన్ (Sangeeth Sivan) హఠాత్తుగా చనిపోవడంతో చిత్రం విడుదల ఏడాది పాటు వాయిదా పడి ఎట్టకేలకు మే23న థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ కప్కపియి (Kapkapiii) చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో హర్రర్, కామెడీ సినిమాలకు మంచి బజ్ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీపై కూడా ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి.
2023లో మలయాళంలో వచ్చిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్ (Soubin Shahir), అర్జున్ అశోకన్ (Arjun Ashokan) కీలక పాత్రలో నటించగా జతిన్ మాదవన్ (Jithu Madhavan) దర్శకత్వం వహించాడు. నాడు కేవలం రూ.3 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తర్వాత ఓటీటీకి వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే వేరే భాషల్లో డబ్బింగ్ చేయకుండా మాతృకలోనే స్ట్రీమింగ్ చేశారు. తెలుగులోనూ ఈ మూవీని రిమేక్ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.