Delhi Crime Season 3: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3.. ఓటీటీకి వచ్చేస్తోంది
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:00 PM
గతంలో రెండు సీజన్లుగా ఓటీటీకి వచ్చి అలరించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఢిల్లీ క్రైమ్.
గతంలో రెండు సీజన్లుగా ఓటీటీకి వచ్చి అలరించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. అంతుపట్టకుండా సాగే మర్డర్స్ వాటిని చేధించే క్రమంలో పోలీసుల జరిపే శోధన ఇత్యాది అంశాలతో కేసును చేధించే కథతో చివరి వరకు మంచి థ్రిల్ ఇస్తాయి. తాజాగా ఈ సిరీస్‌లో మరో మూవడ సీజన్ విడుదలకు ముస్తాబయింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది. మొదటి రెండు భాగాలలో పోలీసులుగా నటించినసెఫాలి షా, రసిక దగ్గల్‌తో పాటు ఈ మారు కొత్తగా హుమా ఖురేషి కీ రోల్ చేయనుంది.